STOCKS

News


ఈ మార్కెట్‌ స్వల్పకాలిక ట్రేడర్లకు అనుకూలం

Wednesday 26th December 2018
Markets_main1545810881.png-23240

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు పెరుగుతున్నాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (టెక్నికల్‌ రీసెర్చ్‌) శ్రీకాంత్‌ చౌహన్‌ తెలిపారు. షార్ట్‌ టర్మ్‌ ట్రేడర్లకు ఇది అనుకూలమని పేర్కొన్నారు. అయితే పొజిషనల్‌ ట్రేడర్లకు మాత్రం ఇది కొంత కష్టకాలమేనని అభిప్రాయపడ్డారు. చాలా సమయాల్లో మార్కెట్లు అనుకున్నట్లుగానే కదులుతాయని, అయితే  తీవ్ర ఒడిదుడుకులు చూడాల్సి వస్తుందని తెలిపారు. 2018లో కన్నా 2019లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. 
గతాన్ని గమనిస్తే.. నిఫ్టీ చాలా సార్లు నాటకీయంగా మలుపు తీసుకుందని శ్రీకాంత్‌ చౌహన్‌ తెలిపారు. 10,710 నుంచి కిందకు పడిపోవడం, 10,105 నుంచి పైకి పెరగడం వంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. 2018 అక్టోబర్‌లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. డిసెంబర్‌ నెలలో చూస్తే ఇండెక్స్‌ 10,333 నుంచి పైకి పెరిగిందని, అలాగే 10,961 నుంచి కిందకు పడిపోయిందని తెలిపారు. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ట్రేడ్‌ చేయాలని ట్రేడర్లకు సూచించారు. ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటమనేది షార్ట్‌ టర్మ్‌ ట్రేడర్లకు సానుకూల అంశమని, వారికి తక్కువ సమయంలో ఎక్కువ కదలికలు నమోదవుతాయని తెలిపారు. గత వారంలో 10,950 స్థాయిని సునాయాసంగా అధిగమించిందని, ఆ సమయంలో వచ్చే కొన్ని వారాలు, నెలల్లో నిఫ్టీ 11,200/11,300 స్థాయికి చేరుకుంటుందని అందరూ భావించారని పేర్కొన్నారు. అయితే రిట్రెస్‌మెంట్‌, బలహీనమైన బ్రెడ్త్‌ కారణంగా ఇండెక్స్‌ మళ్లీ 10,750/10,740 స్థాయికి పడిపోయిందన్నారు. 10,333 నుంచి 10,985 ర్యాలీలో 10,750/10,740 అనేది 40 శాతం రిట్రెస్‌మెంట్‌ స్థాయి అవుతుందని తెలిపారు. 



You may be interested

భారీ నష్టాల నుంచి బ్యాంకింగ్‌ షేర్ల రికవరీ

Wednesday 26th December 2018

మిడ్‌సెషన్ సమయంలో మార్కెట్లో నెలకొన్న ఆకస్మిక కొనుగోళ్లతో బ్యాంకింగ్‌ షేర్లు భారీ నష్టాల నుంచి రికవరి అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు 26,634.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ తొలిదశలో బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో ఒకానొక దశలో 1.50శాతం(300 పాయింట్లు) నష్టపోయి 26,408.15 కనిష్టానికి చేరుకుంది. అటుతర్వాత కనిష్టస్థాయిలో కొనుగోళ్లు జరగడంతో నష్టాల్లోంచి లాభాల్లో మళ్లింది. కనిష్టస్థాయి(26,408.15) నుంచి దాదాపు 500 పాయింట్ల రికవరీ అయ్యి 26,905.30 వద్ద గరిష్టాన్ని తాకింది.

వచ్చే ఏడాది పసిడిదే: నిర్మల్‌ బంగ్‌

Wednesday 26th December 2018

వచ్చే ఏడాది కచ్చితంగా బులియన్‌ మార్కెట్‌దేనని నిర్మల్‌ బంగ్‌ కమోడిటీ రీసెర్చ్‌ హెడ్‌ కునాల్‌ సాహా అభిప్రాయపడుతున్నారు. పసిడిని అధికంగా వినియోగించే చైనా, ఇండియాల నుంచి నుంచి పసిడికి డిమాండ్‌ తగ్గడం, అమెరికా వడ్డీరేట్ల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించడంతో ఈ ఏడాదిలో బులియన్‌ ర్యాలీ చాలా నెమ్మదిగా జరిగిందని ఆయన తెలిపారు. అలాగే వచ్చే ఏడాది(2019)లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై ఎలాంటి వైఖరీకి కట్టుబడి ఉంటుందో ఎవరికీ తెలియదని, అమెరికా

Most from this category