STOCKS

News


ఎఫ్‌పీఐల ప్రవాహం పెరుగుతుంది!

Thursday 14th March 2019
Markets_main1552540583.png-24595

మార్కెట్‌ నిపుణుడు అడ్రైన్‌ మొవత్‌
దేశీయ మార్కెట్లోకి విదేశీనిధుల ప్రవాహం ఈ ఏడాది మరింత పెరుగుతుందని వర్దమాన ఈక్విటీ మార్కెట్ల నిపుణుడు అడ్రైన్‌ మొవత్‌ అభిప్రాయపడ్డారు. భారత మార్కెట్‌ స్థూల పరిస్థితులు మెరుగయ్యాయని చెప్పారు. దేశ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌పై ఎలాంటి సందేహాలు లేవన్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం కీలక పాజిటివ్‌ అంశమని చెప్పారు. దీంతో ఆర్‌బీఐ ఈ ఏడాది మరిన్ని మార్లు రేట్‌కట్‌ ప్రకటించే ఛాన్సులున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారన్నారు. గతేడాది గడ్డు పరిస్థితుల్లో కూడా భారత మార్కెట్‌ మంచి ప్రదర్శనే చూపిందన్నారు.

ఈ ఏడాది తొలి రెండు నెలల్లో గతేడాది పేలవ ప్రదర్శన చూపిన ప్రపంచదేశాల మార్కెట్లలో పలు మార్కెట్లు రికవరీ బాట పట్టాయన్నారు. ముఖ్యంగా చైనా మార్కెట్లో ఈరికవరీ స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ఇకమీదట చైనా ఆర్థిక గణాంకాలు సైతం మెరుగుపడే ఛాన్సులున్నాయని అడ్రైన్‌ అంచనా వేశారు. ఇదే జరిగితే మార్కెట్లకు మంచి మద్దతు దొరుకుతుందని చెప్పారు. దేశీయ మార్కెట్లో ఆటో స్టాకులపై న్యూట్రల్‌గా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల వేళ కొంతమేర ద్విచక్రవాహనాల కొనుగోళ్ల సందడి కనిపించినా ఇప్పటికిప్పుడు మారుతీ, టాటామోటర్స్‌లాంటి షేర్లలో బలమైన కొనుగోలు ఆసక్తి కనిపించడం లేదని తెలిపారు. You may be interested

పసిడి తగ్గుముఖం

Thursday 14th March 2019

డాలర్‌ రికవరీతో  బ్రెగ్జిట్‌ అనిశ్చితి ఓ కొలిక్కి రావడంతో పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,309.50 డాలర్ల వద్ద ప్రారంభించింది. లాంటి ఒప్పందం లేకుండా బ్రిటన్‌ యూరోపియన్ యూనియన్(ఈయూ)నుంచి వైదొలగాలనే ప్రతిపాదనను దిగువసభ 'హౌస్ ఆఫ్ కామన్స్‌'లో ఎంపీలు తిరస్కరించడంతో  వరుసగా 4రోజులు నష్టపోయిన డాలర్‌ ఇండెక్స్‌ నేడు రీవకరీ బాట పట్టింది. ఫలితంగా 7.50డాలర్లు నష్టపోయి 1,302.65

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 14th March 2019

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  లుపిన్‌:- నిర్వహణలో లోపం కారణంగా మధ్యప్రదేశ్‌లోని మన్‌దీప్‌ యూనిట్‌లో ఉత్పత్తులను నిలిపివేయాలని యూఎస్‌ఎఫ్‌డీఏ ఆదేశాలు జారీ చేసింది.  సాతిన్‌ కేర్‌క్రిడెట్‌ నెట్‌వర్క్‌:- కంపెనీ కమర్షియల్‌ పేపర్లపై రేటింగ్‌ సం‍స్థ కేర్‌ రేటింగ్‌ను ఎ(1) నుంచి ఎ(2)కు పెంచింది.  రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- నిధుల జారీ అభ్యర్థనపై ఎన్‌సీఎల్‌టీఏ స్టే విధించింది.  ఐఓసీ, ఓఎన్‌జీసీ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి

Most from this category