STOCKS

News


6 నెలల్లో ఆకర్షణీయంగా బ్లూచిప్స్‌!!

Friday 21st December 2018
Markets_main1545380741.png-23140

వచ్చే 3-6 నెలల కాలంలో బ్లూచిప్‌ కంపెనీల షేర్లు ఆకర్షణీయ వ్యాల్యుయేషన్స్‌తో ఉంటాయని అవెండస్‌ క్యాపిటల్‌ ఆల్టర్నేట్‌ సీఈవో ఆండ్రూ హోలండ్‌ తెలిపారు. వచ్చే ఆరు నెలల కాలంలో గ్రామీణ డిమాండ్‌ పుంజుకోవడం వల్ల కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌ క్యాప్స్‌తో పోలిస్తే లార్జ్‌ క్యాప్స్‌ మంచి రాబడులు అందిస్తాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
2019 ప్రారంభపు నెలల్లో ఒడిదుడుకులు ఉంటాయని ఆండ్రూ హోలండ్‌ తెలిపారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉందన్నారు. వీటి ప్రభావం గ్లోబల్‌ మార్కెట్లపై ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. వచ్చే సంవత్సరంలో అభివృద్ధి చెందిన మార్కెట్లు కరెక‌్ష్‌కు గురికావొచ్చని అంచనా వేశారు. వర్ధమాన మార్కెట్లు మంచి పనితీరు కనబర్చవచ్చని పేర్కొన్నారు. అయితే గ్లోబల్‌ మార్కెట్లతోపాటు వీటిల్లోనూ క్షీణత ఉంటుందని తెలిపారు. అయితే ఇలాంటప్పుడే నాణ్యమైన స్టాక్స్‌ను ఆకర్షణీయమైన ధరకు పొందొచ్చని పేర్కొన్నారు.  
సెప్టెంబర్‌-అక్టోబర్‌ కాలంలో పలు నాణ్యమైన బ్లూచిప్‌ స్టాక్స్‌ కరెక‌్షన్‌కు గురయ్యాయని ఆండ్రూ హోలండ్‌ గుర్తు చేశారు. దేశీ, విదేశీ అమ్మకాల ఒత్తిడి ఇందుకు కారణంగా పేర్కొన్నారు. కరెక‌్షన్‌కు గురైన స్టాక్స్‌.. కనిష్ట స్థాయిల నుంచి ర్యాలీ చేశాయని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వచ్చే 3- 6 నెలల కాలంలో ఇలాంటి అవకాశమే అందుబాటులోకి రావొచ్చని పేర్కొన్నారు. క్రూడ్‌ ఆయిల్‌ ధర 60 డాలర్ల దిగువున ఉందని, ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సరళ విధానాలు అనుసరించవచ్చనే అంచనాలున్నాయని తెలిపారు. బాండ్‌ ఈల్డ్‌ 7.1 శాతానికి చేరొచ్చని అంచనా వేశారు. వ్యవస్థలో లిక్విడిటీ సమృద్ధిగా అందుబాటులోకి వస్తుందని, బ్యాంకింగ్‌ రంగ షేర్లు మంచి పనితీరు కనబరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో డిమాండ్‌ పుంజుకుంటే కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ పెరుగుతాయని పేర్కొన్నారు. అందువల్ల ఇండియన్‌ మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్నానని తెలిపారు. 
సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా 2019 రెండో అర్ధ భాగంలో ప్రైవేట్‌ పెట్టుబడులు జోరందుకుంటాయని ఆండ్రూ హోలండ్‌ పేర్కొన్నారు. వడ్డీ రేట్ల తగ్గుదల వల్ల స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ కంపెనీల మార్జిన్లు మెరుగుపడుతాయని తెలిపారు. వచ్చే 2-3 నెలల్లో మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా వీటిల్లో కరెక‌్షన్‌ ఉండొచ్చని అంచనా వేశారు. 
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఏ పెట్టుబడి సాధనం కూడా ఔట్‌పర్ఫార్మ్‌ చేయలేదని ఆండ్రూ హోలండ్‌ తెలిపారు. అన్నింటిలోకెల్లా బాండ్లు కొద్దిగా ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది చాలా వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు నిరుత్సాహానికి గురిచేశాయని తెలిపారు. భారత్‌ విషయానికి వస్తే తక్కువ వడ్డీ రేట్లు, కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ మెరుగుదల అంచనాలు వంటివి సానుకూల అంశాలని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లలో కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ తగ్గుముఖం పట్టాయని గుర్తు చేశారు. వేతనాలు పెరిగాయని తెలిపారు. వడ్డీ రేట్ల ఎగశాయని పేర్కొన్నారు.  



You may be interested

మార్కెట్‌ పతనానికి ఐదు కారణాలు..

Friday 21st December 2018

ఇండియన ఈక్విటీ మార్కెట్లు శుక్రవార భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా పడిపోతే, నిఫ్టీ 180 పాయింట్లకు పైగా క్షీణించింది. మధ్యాహ్నం 2:41  సమయంలో సెన్సెక్స్‌ 594 పాయింట్ల నష్టంతో 35,835 వద్ద, నిఫ్టీ 181 పాయింట్ల 10,770 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ పతనానికి గల కారణాలను గమనిస్తే..   అంతర్జాతీయ మార్కెట్ల పతనం.. వడ్డీ రేట్ల పెంపు, అమెరికా ప్రభుత్వం పాక్షిక మూసివేత ఆందోళనలు వంటివి అక్కడి మార్కెట్‌పై తీవ్రప్రతికూల

బ్యాంకులకు మూలధనం.. ఒరిగేదేంలేదు!!

Friday 21st December 2018

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ సిటీ అంచనా కేంద్ర ప్రభుత్వం వచ్చే కొన్ని నెలల్లో ప్రభుత్వ బ్యాంకులకు రూ.83,000 కోట్ల మూలధనాన్ని అందిచనుంది. ఈ నిధుల సంబంధిత బ్యాంకుల వృద్ధికి దోహదపడకపోవచ్చని గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ సిటీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అందించే మూలధనం ప్రభుత్వ బ్యాంకుల వృద్ధికి సహాయపడకపోవచ్చు. కానీ అవి దివాలా తీయకుండా ఆప్పగలదని పేర్కొంది. అలాగే మూలధనం అందుకోవడం వల్ల కొన్ని బ్యాంకులు ఆర్‌బీఐ నిర్దేశిత సత్వర దిద్దుబాటు

Most from this category