STOCKS

News


స్వల్పంగా పెరిగిన పసిడి

Thursday 9th August 2018
Markets_main1533790666.png-19062

అమెరికా - చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ మరింత ముదరడంతో పసిడి ధర బలపడుతోంది. అమెరికా ప్రారంభించిన ట్రేడ్‌వార్‌పై ఈసారి చైనా గట్టిగా ప్రతిఘటించింది. ఆగస్ట్‌ 23 నుంచి అమెరికా నుంచి దిగుమతయ్యే 16 బిలియన్‌ డాలర్ల కోట్ల విలువైన ఇంధన, ఉక్కు ఉ‍త్పత్తులతో పాటు, అటో, వైద్య పరికరాలపై 25 శాతం టారిఫ్‌ టారీఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇదే ఆగస్ట్‌ 23 నుంచి 16 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధిస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రేడ్‌వార్‌ తీవ్రరూపం దాల్చడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిని అవలంభిస్తూ పసిడి ఫ్యూచర్లలలో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ధర వరుసగా రెండోసారి రోజూ బలపడింది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర బుధవారం భారత కాలమానం ప్రకారం గం.10:00 ని.లకు 2 డాలర్లు పెరిగి 1223 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  మరోవైపు యెన్‌ మారకంలో డాలర్‌ రెండు వారం కనిష్టానికి చేరుకోవడంతో పాటు ఆసియా మార్కెట్ల మిశ్ర ట్రేడింగ్‌ కూడా పసిడి ర్యాలికి కారణమమవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల ముగింపు కారణంగా అక్కడ ఔన్స్‌ పసిడి 1,221.00 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయంగానూ పసిడి అదే ధోరణి:-
అంతర్జాతీయంగా ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ పసిడి ధర పుంజుకుంది. ఎంసీఎక్స్‌లో గురువాం 10 గ్రాముల పసిడి ధర రూ.26లు లాభపడి రూ.29646.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. క్రితం రాత్రి ఎంసీఎక్స్‌లో రూ.23లు లాభపడి రూ.రూ.29620 వద్ద ముగిసింది.



You may be interested

నాట్కో ఫార్మా లాభం 93 శాతం అప్‌

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: నాట్కో ఫార్మా జూన్‌ త్రైమాసికానికి చక్కని ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ లాభం ఏకంగా 93 శాతం వృద్ధి చెంది రూ.181 కోట్లుగా నమోదైంది. విక్రయాలు పెరగడంతో కంపెనీ ఈ స్థాయి లాభాలను నమోదు చేసింది. ఆదాయం సైతం రూ.574 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది జూన్‌ త్రైమాసికంలో లాభం రూ.93.7 కోట్లు, ఆదాయం రూ.448 కోట్లుగా ఉండడం గమనార్హం. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు

రూపాయి రయ్‌.. రయ్‌..

Thursday 9th August 2018

68.47 వద్ద ప్రారంభం బుధవారం ముగింపు 68.63తో పోలిస్తే 0.24 శాతం అప్‌ ఇండియన్‌ రూపాయి గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే బలపడింది. రిజర్వు బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రభుత్వానికి రూ.50,000 కోట్ల డివిడెంట్‌ అందిస్తామని ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణం. దీనివల్ల ప్రభుత్వానికి నిధులు సమకూరి, ద్రవ్యలోటు కొంత తగ్గుతుంది. క్రూడ్‌ అయిల్‌ ధరలు తగ్గడం, మార్కెట్లు సానుకూలముగా ఉండటం వంటి అంశాలు కూడా సానుకూల ప్రభావం చూపాయి. ఉదయం 9:10

Most from this category