STOCKS

News


వ్యాల్యుయేషన్స్‌ మించితే వైదొలగండి

Tuesday 6th November 2018
Markets_main1541488729.png-21754

మార్కెట్‌లో ఇంకా 3-4 శాతం కరెక‌్షన్‌ మిగిలే ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామ్‌డియో అగర్వాల్‌ తెలిపారు. మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌ క్యాప్స్‌లో పతనం కొనసాగుతుందని, మార్కెట్‌ మొత్తంగా చూస్తే దిద్దుబాటుకు గురయ్యిందని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగా ఉంటే తప్ప ఎఫ్‌ఐఐలు మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశించరని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ద్రవ్యోల్బణానికి సమంగా కార్పొరేట్‌ ఫ్రాఫిట్స్‌ పెరగడం లేదని గుర్తుచేశారు. చెప్పుకోదగ్గ ఈవెంట్‌ జరిగేంత వరకు మార్కెట్‌ మొత్తంగా రేంజ్‌ బౌండ్‌లో కదలాడవచ్చని అంచనా వేశారు. ‍క్రూడ్‌ ధరలు 100 డాలర్లకు చేరితే అప్పుడు పరిస్థితులు మరింత అద్వానంగా మారుతాయని తెలిపారు. కార్పొరేట్‌ రంగం లేదా కంపెనీల ఎర్నింగ్స్‌ను ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపకపోవచ్చని పేర్కొన్నారు. ఇటీవల కరెక‌్షన్‌ తర్వాత కొన్ని స్టాక్స్‌ వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగానే ఉన్నాయని, అయితే రిటైల్‌ ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు సానుకూలముగా లేవని తెలిపారు.
గ్లోబల్‌ లిక్విడిటీ, మనీ ఫ్లో వంటి అంశాల పరంగా చూస్తే ప్రస్తుతం మనం గడ్డు పరిస్థితులను ఎదుర్కొనున్నామని రామ్‌డియో అగర్వాల్‌ పేర్కొన్నారు. అమెరికా, యూరప్‌, జపాన్‌ వంటి దేశాలు ఉద్దీపణలను వెనక్కు తీసుకుంటున్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా లిక్విడిటీ తగ్గుతోందన్నారు. భారత్‌లో ఎర్నింగ్స్‌ వృద్ధి లేదని పేర్కొన్నారు. అదేసమయంలో వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత వ్యాల్యుయేషన్స్‌ ప్రకారం చూస్తే ఎఫ్‌ఐఐలు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ సుమరుగా 3.2 శాతం స్థాయిలో ఉన్నాయని తెలిపారు. వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగా ఉంటేనే ఎఫ్‌ఐఐలు ఇన్వెస్ట్‌ చేయడానికి ఇష్టపడతారని పేర్కొన్నారు. కంపెనీల ఎర్నింగ్స్‌లో మంచి వృద్ధి నమోదు కావాల్సి ఉందన్నారు. 
ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో లిక్విడిటీ సంక్షోభం కారణంగా ఏ కంపెనీ బాగుందో.. ఏ కంపెనీ బాగులేదో గుర్తుపట్టొచ్చని రామ్‌డియో అగర్వాల్‌ తెలిపారు. అన్ని ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొగలవని ధీమా వ్యక్తంచేశారు. బాగా పతనమైన స్టాక్స్‌లో పెరుగుదల ఉంటుందని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీలు బుక్‌ వ్యాల్యు కన్నా తక్కువగా ట్రేడ్‌ అయితే అవి ఈక్విటీని సమకూర్చుకోలేవని, అప్పుడు వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. వచ్చే 5-6 ఏళ్లలో అవి చెప్పుకోదగ్గ లాభాలను అర్జించలేవని అంచనా వేశారు.
ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కొన్ని ప్రైవేట్‌ బ్యాంకులు, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల్లో తప్ప మిగిలిన వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగ లేవని రామ్‌డియో అగర్వాల్‌ తెలిపారు. పీఈ 50కి పైగా ఉన్న మంచి కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినా కూడా దీర్ఘకాలంలో 15 శాతానికిపైగా రిటర్న్స్‌ను అందుకోలేవని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఓవర్‌ వ్యాల్యుతో ఉన్నాయని తెలిపారు. 
స్టాక్‌ మార్కెట్‌ ప్రస్తుత ఎర్నింగ్స్‌ పనితీరు ఆధారంగా భవిష్యత్‌ను అంచనా వేస్తుందని రామ్‌డియో అగర్వాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కంపెనీ గరిష్ట వృద్ధి రేటును సాధిస్తుంటే.. అప్పుడు భవిష్యత్‌లో దాని వ్యాల్యుయేషన్స్‌ బాగా పెరుగుతాయనే అంచనాలుంటాయని తెలిపారు. అధిక వృద్ధి రేటు అంచనాల వల్ల స్మార్ట్‌ ఇన్వెస్టర్లు ఇలాంటి స్టాక్స్‌కు దూరంగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే ఇప్పటికే ఇలాంటి స్టాక్స్‌ను కలిగిన వారు వ్యాల్యుయేషన్స్‌ అపరిమిత స్థాయిలకు చేరితే వాటి నుంచి నిష్క్రమించడం ఉత్తమమని సూచించారు. 



You may be interested

గోల్డ్‌ ఈటీఎఫ్‌ల జోలికొద్దు..

Tuesday 6th November 2018

టైటాన్‌ ఇండస్ట్రీస్‌ బెస్ట్‌.. వ్యాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌ వ్యాఖ్య గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు దూరంగా ఉండటం ఉత్తమమని సూచిస్తున్నారు వ్యాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. బంగారంపై ఇన్వెస్ట్‌ చేయాలని భావించే వారు టైటాన్‌ ఇండస్ట్రీస్‌ షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. పసిడిలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఆనందం పొందలేమన్నారు. గోల్డ్‌ను ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా చూడకూడదని అభిప్రాయపడ్డారు. బంగారంలో వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని తెలిపారు. అయితే సావరిన్‌ గోల్డ్‌

మార్కెట్‌పై బేరిష్‌గా లేను: రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా

Tuesday 6th November 2018

స్థూల అంశాలన్నీ భారత మార్కెట్‌కు అనుకూలంగా మారిపోయాయని వ్యాఖ్యానించిన ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా ముంబై: ప్రస్తుత క్యాలెండర్‌ ఇయర్‌లో స్టాక్‌ సూచీలు జీవితకాల గరిష్టస్థాయి నుంచి ఒక్కసారిగా రెండంకెల పతనాన్ని నమోదుచేయడం చూసి ఏమాత్రం విశ్వాసాన్ని కోల్పోవల్సిన అవసరం లేదని బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా వ్యాఖ్యానించారు. 10,000 పాయిం‍ట్ల వద్ద బోటమ్‌ను పరీక్షించిన నిఫ్టీ 11,000-11,100 స్థాయిలో నిరోధాన్ని ఎదుర్కొవచ్చని విశ్లేషించారు. ర్యాలీ కొనసాగనంత మాత్రాన మార్కెట్లపై నమ్మకాన్ని

Most from this category