STOCKS

News


భారీ లాభాలతో ప్రారంభమైన యూరప్‌ మార్కెట్లు

Wednesday 7th November 2018
Markets_main1541589838.png-21775

యూరప్‌ మార్కెట్ల ప్రారంభ సమయానికి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రటిక్‌ పార్టీ సంపూర్ణ విజయం ఖరారు కావడం యూరప్‌ మార్కెట్లకు ఉత్సాహానిచ్చింది. బ్రిటన్‌ చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ100 సూచీ 1శాతం లాభంతో 7,113 పాయింట్ల వద్ద, జర్మనీ డాక్స్‌ 1శాతం పెరిగి 11,598 వద్ద, ఫ్రాన్స్‌కు చెందిన సీఎసీ40 సూచీ 1.1శాతం ర్యాలీ 5,131 వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి. ‘‘మార్కెట్‌ వర్గాలు ఊహించిన విధంగానే అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అక్టోబర్‌లో మార్కెట్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. కొల్పోయిన లాభాలను ఇప్పుడు తిరిగి అందుకునేందుకు ప్రయత్నించవచ్చు’’ అని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



You may be interested

మూహూరత్‌ ట్రేడింగ్‌ ప్రారంభం అదిరింది.

Wednesday 7th November 2018

 ముంబై:- భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ దీపావళి ప్రత్యేక ముహూరత్‌ ట్రేడింగ్‌ అదిరిపోయేలా ప్రారంభమైంది. మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగా అమెరికాలో దిగువసభ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ విజయం ఖరారు కావడంతో ప్రపంచమార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. సంవత్‌ 2075 ప్రారంభపు రోజైన దీపావళినాడు జరిగిన ముహూరత్‌ ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు.  యూరప్‌ మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్లు భారీ లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటం కూడా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా బీఎస్‌ఈ

మిశ్రమంగా ముగిసిన ఆసియా మార్కెట్లు

Wednesday 7th November 2018

మార్కెట్‌ వర్గాలు ఊహించినట్లుగానే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రటిక్‌ పార్టీ విజయం సాధించడంతో బుధవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఆసియాలో జపాన్‌ మార్కెట్‌ ప్రధాన సూచీ నికాయ్‌ 225(0.28శాతం), చైనాకు చెందిన షాంఘై సూచీ(0.68శాతం),  దక్షిణ కొరియాకు దేశపు కోప్సీ సూచీ(0.53)లు నష్టపోయాయి. మిగిలిన అన్ని దేశపు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా తైవాన్‌ మార్కెట్‌ 1శాతం ర్యాలీ చేసింది. దానితో పాటు సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్స్ టైమ్స్,

Most from this category