News


పాజిటివ్‌గా ప్రపంచమార్కెట్లు

Monday 4th March 2019
Markets_main1551695726.png-24423

చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం రాజీ దిశగా పయనిస్తున్న సాగుతున్న నేపథ్యంలో సోమవారం ప్రపంచమార్కెట్లలో పాజిటివ్‌ ట్రెండ్‌ నెలకొంది. ఆసియాలో కొరియా, తైవాన్‌ సూచీలు తప్ప మిగిలిన అన్ని మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరోపియన్‌ జోన్‌లో సైతం ప్రధాన మార్కెట్లన్నీ లాభాలతో ప్రారంభమయ్యాయి. వాస్తవానికి మార్చి 1నుంచి చైనా నుంచి దిగుమతయ్యే 200 బిలియన్‌ డాలర్ల వస్తువులపై 10శాతం నుంచి 25శాతానికి పెంచాల్సి ఉంది. అయితే  ఈ రెండు దేశాల మధ్య చర్చలు సజావుగా జరగడంతో ట్రంప్‌ ప్రభుత్వం సుంకాల పెంపును వాయిదా వేసింది. చర్చలు విజయవంతంగా ముగిస్తే చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన అంక్షలు మొత్తం తొలగిపోయే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతుండటంతో అటు ఆసియాతో పాటు, యూరప్‌ మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఆసియాలో ప్రధాన మార్కెట్లైన చైనా, జపాన్‌, సింగపూర్‌ దేశాలకు చెందిన ఇండెక్స్‌లు 1శాతం లాభంతో ముగిశాయి. అలాగే హాంగ్‌కాంగ్‌ సూచీ అరశాతం లాభపడింది.  ఆసియా మార్కెట్ల లాభాల ముగింపును అందిపుచ్చుకున్న యూరప్‌ మార్కెట్లు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్రిటన్‌ ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 1శాతం లాభపడగా, ఫ్రాన్స్‌ సూచీ సీఈసీ 0.50శాతం, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 0.25శాతం లాభపడింది. అలాగే అమెరికా ఫ్యూచర్లు సైతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 
చైనా- అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు నేపథ్యంలో ప్రపంచమార్కెట్లలో పాజిటివ్‌ ట్రెండ్‌ నెలకొన్నప్పటికీ, భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రికత్తల తగ్గకపోవడంతో విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ భారీ నష్టాలతో కదులుతోంది.



You may be interested

మరింత తగ్గిన పసిడి

Monday 4th March 2019

ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో గత శుక్రవారం భారీగా తగ్గిన పసిడి సోమవారం మరింతగా నష్టపోయింది. మధ్యాహ్నం సమయంలో యూరప్‌ మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 11.05 డాలర్లు నష్టపోయి 1,288.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అలాగే డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ సైతం పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో

పదేళ్లలో మల్టీబ్యాగర్లు ఇవే

Monday 4th March 2019

ముంబై:- అమెరికా ఆర్థిక సంక్షోభం తర్వాత గత పదేళ్లలో మార్కెట్‌ పడుతూ, లేస్తూ వున్నా...  కేవలం రూ.10వేల పెట్టుబడితో 10ఏళ్ల కాలపరిమితిలో ఇన్వెస్టర్లను కోటిశ్వర్లను, లక్షాధికారులను చేసిన మల్టీబ్యాగర్లు స్టాక్‌ మార్కెట్లో ఉన్నాయి. అలాంటి మల్టీబ్యాగర్లు ఇవే... వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ షేరు:- సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2009 మార్చిలో కంపెనీ షేరు ధర రూ.0.20 పైసలు మాత్రమే. తన అనుబంధ సంస్థ హార్డ్‌క్యాస్టిల్‌ రెస్టారెంట్స్‌ పశ్చిమ, దక్షిణ భారత్‌లో

Most from this category