STOCKS

News


టాటాస్టీల్‌ షేరు ఈయూ షాక్‌..!

Wednesday 31st October 2018
news_main1540968893.png-21602

టాటా స్టీల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ షాక్‌నిచ్చింది. యూరప్‌లో ఏర్పాటయ్యే టాటా స్టీల్, జర్మనీ స్టీల్ కంపెనీ థిసేన్‌క్రుప్‌ల భాగస్వామ్య కంపెనీతో ఏర్పడే జాయింట్‌ వెంచర్‌పై దర్యాప్తుకు కమీషన్‌ను ఏర్పాటు చేయడంతో​ టాటాస్టీల్‌ కంపెనీ షేరు బుధవారం బీఎస్‌ఈలో 6శాతం పతమనమైంది. నేడు షేరు రూ.556.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈయూ కమీషన్‌ ఏర్పాటు వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో షేరు  6శాతం నష్టపోయి రూ. 530.10ల కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.2:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.565.1)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో రూ.533.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.493.50 రూ.755.06లుగా నమోదయ్యాయి. జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుపై దర్యాప్తుకు ఈయూ ఆదేశం.

దిగ్గజ కంపెనీ టాటా స్టీల్, జర్మనీ స్టీల్ కంపెనీ థిసేన్‌క్రుప్ సంస్థల విలీనంతో ఏర్పడే భాగస్వామ్య కంపెనీపై సమగ్ర విచారణకు యూరోపియన్‌ యూనియన్ కమీషన్‌ను ఏర్పాటు చేసింది. విలీనం తర్వాత ఏర్పడే టాటాస్టీల్‌ థిసేన్‌క్రుప్ జాయింట్‌ వెంచర్‌ యూరప్‌లో రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి సంస్థగా ఏర్పడనుంది. యూరోపియన్‌ చట్టాలను లోబడే విలీన ప్రకియ జరుగుతుందో లేదో అంశంతో పాటు​  వెంచర్‌ ఏర్పాటు అనంతరం​స్టీల్‌ ధరలపై, ప్రత్యర్థి కంపెనీలపై ఎంతవరకు ప్రభావాన్ని చూపుతుందో అని విశేషాలపై కమీషన్‌ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. ఈ కమీషన్‌ విలీన ప్రక్రియపై 90రోజుల పాటు అధ్యయం చేసి, జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటు స్థితిగతులు, ఆర్థిక వ్యవహారాలు తదితర అంశాలను మార్చి 19న సమగ్ర వివరాలను ఈయూకు అందజేయనుంది. ఒప్పందం ప్రకారం భారతీయ సంస్థ టాటా స్టీల్‌ బ్రిటన్‌ ప్లాంట్లను ఈ జర్మన్ కంపెనీలో విలీనం అయిన తర్వాత ఇవి సంయుక్తంగా ఏడాదికి 13 బిలియన్ పౌండ్ల వ్యాపారం చేసే ఒక పాన్-యూరోపియన్ వెంచర్‌గా మారుతుంది. విలీనంతో ఏటా 400 మిలియన్ పౌండ్ల నుంచి 500 మిలియన్ పౌండ్ల వరకూ ఆదా చేయవచ్చని రెండు కంపెనీలు భావిస్తున్నాయి.



You may be interested

రూపీ పతనంతో అదరగొడుతున్న ఐటీ షేర్లు

Wednesday 31st October 2018

ఆటుపోటు మార్కెట్‌ ట్రేడింగ్‌ రూపాయి పతనంతో ఐటీ షేర్లు పండుగ చేసుకుంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ బుధవారం 2.62శాతం లాభపడింది. డాలరు ఇండెక్స్‌ పటిష్ట ర్యాలీకి తోడు, కేంద్రం, ఆర్‌బీఐకి తీవ్ర విభేదాలు తలెత్తిన నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి విలువ నేడు 74.13 స్థాయికి క్షీణించిన సంగతి తెలిసిందే. రూపాయి పతనంతో ఐటీ షేర్లలో నేడు కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా నిఫ్టీ ఐటీ

2వారాల కనిష్టానికి పసిడి

Wednesday 31st October 2018

డాలర్‌ ఇండెక్స్‌ పటిష్టమైన ర్యాలీ కారణంగా బుధవారం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర రెండు వారాల కనిష్టస్థాయికి పతనమైంది. గత రాత్రి అమెరికా ప్రకటించిన యూఎస్‌ కన్జ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ 18 ఏళ్ల గరిష్టానికి చేరడంతో పాటు రానున్న రోజుల్లో ఆర్థిఖ వ్యవస్థ మరింత వృద్ధి చెందుతునే అంచానాలు నెలకొన్నాయి. పలితంగా ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 97.054 స్థాయిని తాకింది. ఈ స్థాయికి డాలర​

Most from this category