STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌ నేలచూపులు

Wednesday 16th January 2019
Markets_main1547622714.png-23615

  • 8.50శాతం పతనమైన షేరు ధర

కంపెనీలో వాటాను కొనుగోలుకు ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ పీజేఎస్‌సీ కఠినమైన నిబంధనలను ప్రతిపాదించడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు బుధవారం నేలచూపులు చూస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో నిర్ణయాత్మకమైన వాటాను కొనుగోలు చేయాలంటే కంపెనీ ప్రస్తుత ఛైర్మన్‌ నరేష్‌ గోయల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగాలని, ఓపెన్‌ ఆఫర్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రస్తుత ధర మీద రూ.150ల డిస్కౌంట్‌ ఇవ్వాల్సిందిగా ఎతిహాత్‌ ఛైర్మన్‌ టోనీ డగ్లస్‌ ప్రతిపాదించారు. అలాగే కొన్ని  షరతులకు లోబడి మాత్రమే  35 మిలియన్‌ డాలర్ల తక్షణ నిధుల విడుదల చేస్తామని డగ్లస్‌ తెలిపారు. ఒకవేళ ఈ నిబంధలకు జెట్‌ఎయిర్‌వేస్‌ అంగీకరించకపోతే కంపెనీలో  పెట్టుబడి పెట్టేది లేదని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజినీష్‌ కుమార్‌కు రాసిన లేఖలో డగ్లస్‌  పేర్కోనారు. జెట్ ‌ఎయిర్‌వేస్‌లో తన వాటాను 49శాతానికి పెంచుకోవాలని ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ ప్రయత్నిస్తుందనే వార్తలతో గత రెండు రోజులుగా జెయిట్‌ ఎయిర్‌ వేస్‌ భారీ ర్యాలీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా జెట్‌ ఎయిర్‌వేస్ షేర్లు నేటి ఇంట్రాడేలో 8.50శాతం నష్టపోయాయి. డిసెంబర్‌ 10 తరువాత ఈ స్థాయిలో షేర్ల పతనం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.294.4)తో పోలిస్తే 6.66శాతం నష్టపోయి రూ.275ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 163.00 రూ.843.00లుగా ఉన్నాయి.You may be interested

చిన్న స్టాకులతోనే సంపద సృష్టి!

Wednesday 16th January 2019

మోతీలాల్‌ ఓస్వాల్‌  ఈ ఏడాది హవా వర్ధమాన మార్కెట్లదేనని మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రతినిధి మనీశ్‌ సొంథాలియా చెప్పారు. దేశీయ మార్కెట్లో స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌తో మంచి లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ట్రేడ్‌వార్‌ మంటలు కాస్త చల్లబడడం, యూఎస్‌ ఫెడ్‌ స్వరం మృదువుగా మారడం, ఈసీబీ నుంచి కొత్త ఉపసంహరణలు లేకపోవడం వంటి పరిణామాలు, దేశీయంగా ద్రవ్యోల్బణం దిగిరావడం, ఆర్‌బీఐ రేట్‌కట్‌కు అవకాశాలు పెరగడం వంటి పరిణామాలు భారత మార్కెట్లపై పాజిటివ్‌ ప్రభావం

ఆర్‌ఐఎల్‌ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Wednesday 16th January 2019

దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం క్యు3 ఫలితాలు ప్రకటించనుంది. ఈసారి కూడా కంపెనీ బలమైన ఫలితాలు ప్రకటించవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. రిటైల్‌, టెలికం, పెట్రోకెమికల్‌ వ్యాపారాలు బాగుంటాయని భావిస్తున్నాయి. అయితే రిఫైనింగ్‌ విభాగం పేలవ ప్రదర్శన చూపవచ్చని, అందువల్ల ప్రాఫిటబిలిటీపై కొంత ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. రెవెన్యూలో మంచి వృద్ధి ఉన్నా, లాభాలు స్వల్ప పెరుగుదలనే చూపవచ్చని తెలిపాయి. క్రూడాయిల్‌ ధరలు భారీగా పతనం కావడంతో

Most from this category