News


ఈక్విటీలతోనే అధిక సంపద!

Tuesday 5th March 2019
Markets_main1551724984.png-24425

ఎంతో మంది ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కానీ, సూక్ష్మ అంశాలపై అవగాహన పెద్దగా కనిపించదు. భవిష్యత్తు లక్ష్యాలైన పిల్లల విద్య, వివాహాలు, ఇల్లు, రిటైర్మెంట్‌ తదితర అవసరాల కోసం ఇన్వెస్ట్‌ చేసే వారు కొందరే ఉంటారు. అందులోనూ పెట్టుబడుల విలువను తినేసే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అవగాహన చేసుకునే వారు బహు కొద్ది మంది. చాలా మంది ఇన్వెస్ట్‌ చేసినా గానీ లక్ష్యాలను చేరుకోవడానికి దూరండా ఉండిపోవడం వెనుక కారణం ఇదే అయి ఉంటుంది. లేదా ప్రణాళిక లోపం. అందుకే స్మార్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అవసరం అంటున్నారు ఆర్థిక నిపుణులు.

 

ఈక్విటీలు సంపద సృష్టికి మంచి సాధనం. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మరీ మంచి రాబడులను ఇచ్చే సాధనం. గడిచిన 30 ఏళ్ల కాలంలో ఈక్విటీల సగటు రాబడులు 14 శాతంగా ఉంటే, అదే కాలంలో ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఈక్విటీల్లో పెట్టుబడులపై రిస్క్‌ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే, దీర్ఘకాలం పాటు ఈక్విటీల్లో కొనసాగితే ప్రతికూల రాబడుల అవకాశాలు దాదాపు తక్కువేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఏడాది కాలం కోసం అయితే ఈక్విటీలు తగినవి కావు. 30 శాతం వరకూ నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఐదు, పదేళ్ల కోసం అయితే, నష్టపోయే అవకాశాలు ఒక శాతం మాత్రమే ఉంటుంది. పదిహేనేళ్ల కాలంలో అయితే సున్నా శాతమేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

 

ఇక ఈక్విటీల్లో పెట్టుబడులకు మరింత మెరుగైన సాధనం సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అయితే, స్టాక్‌ ఎంపిక, పోర్ట్‌ఫోలియో నిర్వహణను మీ తరఫున ఫండ్‌ మేనేజర్లే చూసుకుంటుంటారు. లిక్విడిటీతోపాటు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌ కూడా వాళ్లే చూసుకుంటుంటారు. సిప్‌ విధానంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలి. దీనివల్ల మార్కెట్లు కరెక్షన్‌లోనూ, గరిష్టాల్లోనూ కొనుగోలుతో ధర సగటు అవుతుంది. మార్కెట్‌ ఆటుపోట్లను అధిగమించేందుకు సిప్‌ చక్కని మార్గం. ఉదాహరణకు పదేళ్లలో రూ.10 లక్షలు పిల్లల విద్య కోసం కావాలనుకుంటే... ఒకేసారి ఈ రోజే రూ.4 లక్షలను ఈక్విటీ ఫండ్స్‌లో ఇ‍న్వెస్ట్‌ చేయాలి. అప్పుడు 12 శాతం రాబడుల రేటు ప్రకారం రూ.12,50,000 పదేళ్లలో సమకూరతాయి. ఒకవేళ ఎఫ్‌డీలో పెడితే పదేళ్ల తర్వాత సమకూరే మొత్తం 7 శాతం రేటు ఆధారంగా రూ.8,00,000. పైగా ఈ రాబడులపై పన్ను రేటు అదనం. అదే మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాల రాబడులపై లక్ష వరకు పన్ను మినహాయింపు ఉంది. ఇంతకుమించిన రాబడులపై పన్ను రేటు కేవలం 10 శాతమే. అందుకే దీర్ఘకాల లక్ష్యాలకు మ్యూచువల్‌ ఫండ్స్‌ అధిక రాబడులతోపాటు, పన్ను ఆదాకు ఉపకరిస్తాయి. 
 You may be interested

ప్రస్తుత మార్కెట్లో ఫండ్‌ మేనేజర్ల వ్యూహం...?

Tuesday 5th March 2019

ఆల్ఫా జనరేషన్‌ (మార్కెట్లతో పోలిస్తే మెరుగైన రాబడులు) కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌, పీఎంఎస్‌ మేనేజర్లు ఈ సమయలో ఏం చేస్తున్నట్టు? ఈ సందేహం సగటు ఇన్వెస్టర్లకు ఎదురుకావడం సహజమే. అయితే, సాధారణ ఇన్వెస్టర్ల మాదిరే గత 14 నెలలుగా ఫండ్‌ మేనేజర్లు సైతం రాబడుల విషయంలో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో అమ్మకాల ఒరవడి, కీలక సూచీల పనితీరు సానుకూలంగా లేకపోవడం దీని వెనుక కారణాలు. గడిచిన

మరింత తగ్గిన పసిడి

Monday 4th March 2019

ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో గత శుక్రవారం భారీగా తగ్గిన పసిడి సోమవారం మరింతగా నష్టపోయింది. మధ్యాహ్నం సమయంలో యూరప్‌ మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 11.05 డాలర్లు నష్టపోయి 1,288.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అలాగే డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ సైతం పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో

Most from this category