News


ఈక్విటీ నిధులు @ రూ.63,744 కోట్లు

Friday 28th December 2018
Markets_main1545972486.png-23281

- గత ఏడాదితో పోలిస్తే 60 శాతం క్షీణత
- నిధుల సమీకరణలో అగ్రస్థానంలో ఐపీఓలు
- ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడి

న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఈ ఏడాది వివిధ ఈక్విటీ మార్గాల ద్వారా రూ.63,744 కోట్లు సమీకరించాయి. గత ఏడాది సమీకరించిన రూ.1.6 లక్షల కోట్ల నిధులతో పోలిస్తే ఇది 60 శాతం తక్కువని డేటా ఎనలిటిక్స్‌ సంస్థ, ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...,
- ఈక్విటీ ద్వారా కాకుండా బాండ్ల జారీ ద్వారా కంపెనీలు మరో రూ.29,944 కోట్లు సమీకరించాయి.
- ఈ ఏడాది నిధుల సమీకరణ జరిగిన వివిధ ఈక్విటీ మార్గాల్లో అత్యధిక నిధులు ఐపీఓ మార్గంలో వచ్చాయి. ఈ మార్గంలో 24 కంపెనీలు రూ.33,244 కోట్లు సమీకరించాయి. గత ఏడాదితో పోల్చితే ఇది దాదాపు సగం. గత ఏడాది మొత్తం 36  కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.67,147 కోట్లు సమీకరించాయి.
- కంపెనీలు ఈ ఏడాది క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) ద్వారా రూ.16,077 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా రూ.10,678 కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌ (ఇన్విట్స్‌) ద్వారా రూ.3,145 కోట్లు సేకరించాయి.
- గత ఏడాది ఓఎఫ్‌ఎస్‌ మార్గంలో సమీకరించిన నిధులు రూ.18,094 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది ఇది రూ.10,678 కోట్లకు తగ్గింది.
- ఈ ఏడాది అతి పెద్ద ఓఎఫ్‌ఎస్‌గా కోల్‌ ఇండియా ఇష్యూ(రూ.5,274 కోట్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రూ.1,848 కోట్లతో లార్సెన్‌ అండ్‌ టుబ్రో ఇష్యూ నిలిచింది.
- క్యూఐపీ నిధుల సమీకరణ కూడా 73 శాతం తగ్గింది. గత ఏడాది ఈ విధానంలో రూ.61,148 కోట్లు రాగా, ఈ ఏడాది 73 శాతం తగ్గి రూ.16,677 కోట్లు మాత్రమే వచ్చాయి. అతి పెద్ద క్యూఐపీగా రూ.3,500 కోట్ల ఐడియా క్యూఐపీ నిలిచింది.
- ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓగా రూ.4,473 కోట్ల బంధన్‌బ్యాంక్‌ ఐపీఓ నిలిచింది.
- ఈ ఏడాది ఎస్‌ఎమ్‌ఈల (స్మాల్‌, మీడియమ్‌ ఎంటర్‌ప్రైజ్‌) కార్యకలాపాలు గత ఏడాది కంటే జోరుగా ఉన్నాయి. ఈ ఏడాది ఎస్‌ఎమ్‌ఈలు ఐపీఓ విధానంలో రూ.2,254 కోట్లు సమీకరించగా, గత ఏడాది ఈ సమీకరణ రూ.1,679 కోట్లుగా మాత్రమే ఉంది.
- ఈ ఏడాది వచ్చిన ఐపీఓలకు మంచి స్పందన లభించింది. అపోలో మైక్రో సిస్టమ్స్‌ ఐపీఓ 176 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది.  ఆ తర్వాతి స్థానాల్లో అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌(115 రెట్లు), రీట్స్‌(67 రెట్లు), హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(60 రెట్లు), గెలాక్సీ సర్ఫెక్టాంట్స్‌(14 రెట్లు), బంధన్‌ బ్యాంక్‌(11 రెట్లు) నిలిచాయి.
- ఐపీఓకు వచ్చిన 24 కంపెనీల్లో కొన్ని కంపెనీలు మాత్రమే మంచి లాభాల్లో ఉన్నాయి. ఇష్యూ ధరతో పోల్చితే అపోలో మైక్రో సిస్టమ్స్‌ షేర్‌ 65 శాతం వరకూ రాబడిని ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కూడా 65 శాతం వరకూ రాబడిని ఇచ్చింది. ఆ తర్వాతి స్థానాల్లో అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌(44 శాతం), లెమన్‌ ట్రీ హోటల్స్‌ (28 శాతం), బంధన్‌ బ్యాంక్‌ (27 శాతం), రీట్స్‌, గెలాక్సీ సర్ఫెక్టాంట్స్‌ చెరో 15 శాతం చొప్పున రాబడులనిచ్చాయి.
- ఈ ఏడాది రెండో అర్థభాగంలో మార్కెట్‌ పతన బాటలో ఉండటం వల్ల ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో సగానిఇక పైగా  షేర్లు వాటి ఇష్యూ ధరల కంటే దిగువకు ప్రస్తుతం ట్రేడవుతున్నాయి.
- ఐపీఓకు రావడానికి ఇప్పటికే 59 కంపెనీలు సెబీ నుంచి అనుమతులు తీసుకున్నాయి. అయినప్పటికీ, వచ్చే ఏడాది ఎన్నికలు పూర్తయ్యేదాకా ఐపీఓల జోరు పెద్దగా ఉండకపోవచ్చు. ఎన్నికల అనిశ్చితే దీనికి కారణం.

161 ఐపీఓలు @ 552 కోట్ల డాలర్లు
ఈ ఏడాది అత్యధిక ఐపీఓలు వచ్చిన స్టాక్‌ ఎక్స్చేంజ్‌లుగా భారత స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు రెండో స్థానంలో నిలిచాయని ఈవై తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదిలో నవంబర్‌ నెల చివరి వరకూ మొత్తం 161 ఐపీఓలు వచ్చాయని, ఈ ఐపీఓలు 552 కోట్ల డాలర్లను సమీకరించాయని ఈవై ఇండియా ఐపీఓ ట్రెండ్స్ నివేదిక పేర్కొంది. ఈ క్యూ3లో 9 ఐపీఓలు రాగా, ఈ క్యూ4లో రెండు ఐపీఓలు మాత్రమే వచ్చాయని వివరించింది. ఎస్ఎమ్‌ఈ ఐపీఓల్లో కూడా ఇదే ధోరణి చోటు చేసుకుంది. ఈ క్యూ3లో 42గా ఉన్న ఎస్‌ఎమ్‌ఈ ఐపీఓలు ఈ క్యూ4లో ఎనిమిదికి తగ్గాయని తెలిపింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ అమెరికాలో 261 ఐపీఓలు 6,000 కోట్ల డాలర్లు సమీకరించాయి.



You may be interested

బెస్ట్‌... ఐఓసీ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ

Friday 28th December 2018

- ప్రభుత్వ రంగంలో లాభదాయకమైనవిగా గుర్తింపు - ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా నష్టాల్లోనే న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలో 2017-18 సంవత్సరంలో అత్యంత లాభదాయక కంపెనీలుగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ ముందున్నాయి. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా అధిక నష్టాలతో ఉన్నవిగా నిలిచాయి. పార్లమెంటు ముందు ప్రభుత్వం ఉంచిన పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సర్వేలో ఈ వివరాలు పేర్కొన్నారు. ప్రభుత్వరంగ కంపెనీల పనితీరుకు సంబంధించి సమగ్ర వివరాలు ఇందులో

త్వరలో కొత్త పసిడి విధానం

Friday 28th December 2018

కేంద్ర వాణిజ్య మంత్రి ప్రభు వెల్లడి న్యూఢిల్లీ: పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో

Most from this category