STOCKS

News


లాభాలతో బోణి

Tuesday 1st January 2019
Markets_main1546352113.png-23348

10900లపై ముగిసిన నిఫ్టీ ఇండెక్స్‌
కొత్త ఏడాది తొలిరోజు మార్కెట్‌ లాభాలతో బోణి చేసింది. చివరి గంటలో ఫైనాన్షియల్‌, బ్యాకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు లాభాలతో ముగిశాయి. నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., వెనువెంటనే నష్టాల్లోకి మళ్లాయి. మధ్యాహ్నం వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.  మిడ్‌సెషన్‌ అనంతరం సూచీలు క్రమంగా నష్టాలను పూడ్చుకుంటూ చివరిగంటలో భారీ స్థాయిలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు లాభాలతో ముగిశాయి.
నిఫ్టీ ఇండెక్స్‌ 10,900పై ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 186 పాయింట్లు లాభపడి 36,254 వద్ద, నిఫ్టీ సూచీ 47 పాయింట్లు పెరిగి 10,910 వద్ద ముగిసింది. వాహన కంపెనీల గత నెల విక్రయ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో అటో షేర్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 35,888 - 36,284 (400 పాయింట్లు) రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10,807.10 - 10,923.60(116 పాయింట్ల) స్థాయిలో కదలాడింది. ఎన్‌ఎస్‌లో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.85శాతం పెరిగి 27,392.40 వద్ద ముగిసింది. 
లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంక్‌లు:- యూకో బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర బ్యాంకులకు మొత్తం రూ.10,882 కోట్ల మూలధన నిధులు అందడంతో ఆయా బ్యాంకు షేర్లు లాభాల బాటపట్టాయి. ఈ నాలుగు కంపెనీలకు చెందిన షేర్లు 4శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీయూఎస్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 1.60శాతం ర్యాలీ చేసింది. 
ఇన్ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, ఎంఅండ్‌ఎం షేర్లు 1నుంచి 4శాతం నష్టపోయాయి.



You may be interested

మార్కెట్లను మెప్పించని మారుతి డిసెంబర్‌ అమ్మకాలు

Tuesday 1st January 2019

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి డిసెంబర్‌ అమ్మకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. కంపెనీ ఈ డిసెంబర్‌లో మొత్తం 1.28 లక్షల వాహన విక్రయాలు జరిగాయి. అయితే నోమురా సంస్థ డిసెంబర్‌లో 1.30లక్షల వాహన విక్రయాలు జరగవచ్చని అంచనావేసింది. గతేడాది ఇదే నెలలో జరిగిన దేశీయంగా అమ్మకాలతో పోలిస్తే స్వల్పంగా 1.8శాతం పెరిగాయి. ఈ నెలలో మొత్తం 1.21 లక్షలుగా నమోదయ్యాయి. అయితే విదేశాలకు ఎగుమతులు మాత్రం 36.4శాతం

ఈ జనవరి చాలా బెటర్‌!

Tuesday 1st January 2019

స్టాక్స్‌ ఎంపికకు అనువైనది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సీఐఓ ఎస్‌ నరేన్‌ ఎన్నికల కారణంగా ఈ సంవత్సరం మార్కెట్లో ఒడిదుడుకులు అధికంగా ఉండొచ్చని, అందువల్ల కొత్త ఇన్వెస్టర్లు సాధ్యమైనంత వరకు సిప్‌ మార్గాన్ని ఎంచుకోవాలని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సీఐఓ ఎస్‌ నరేన్‌ సూచించారు. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరి స్టాక్స్‌ ఎంపికకు చాలా అనువుగా ఉందని అభిప్రాయపడ్డారు. గత జనవరిలో మార్కెట్లు భారీ వాల్యూషన్లతో ఉన్నాయని, స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌లో చాలావరకు

Most from this category