News


ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ షేర్లకు ఆర్‌బీఐ షాక్‌..!

Friday 26th October 2018
Markets_main1540534153.png-21491

ముంబై:- ఫైనాన్స్‌రంగ కంపెనీలైన ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 27 - 21శాతం పతనమయ్యాయి. ఇరు కంపెనీలు వేర్వేరుగా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లను ప్రత్యేకంగా లిస్ట్‌ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించడం ఈ షేర్ల పతనానికి కారణమైంది. హోల్డింగ్‌ సంస్థల ద్వారా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ను నిర్వహిస్తున్న ప్రమోటర్లు తప్పనిసరిగా వీటిని  ప్రత్యేక సంస్థలుగా ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌ చేయాలని తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ లైసెన్సులు పొందిన ప్రమోటర్లు నిబంధనల ప్రకారం మూడేళ్లలోగా వీటిని ఎక్చ్సేంజ్‌ల్లో లిస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను 2019 సెప్టెంబర్‌ లోగా, ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ 2020 జనవరి చివరికల్లా విడిగా లిస్ట్‌ చేయవల్సి ఉంటుంది. ఈ వార్తల నేపథ్యంలో ఇరు కంపెనీల షేర్లలో అమ్మకాలు మొదలయ్యాయి. ఇరు కంపెనీల షేర్లు లిస్టింగ్‌ అనంతరం తొలిసారిగా ఇంత స్థాయిలో ఇదే ప్రథమం.
ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌:- నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.116.2ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో గత ముగింపు(రూ.129.2) ధరతో పోలిస్తే 27శాతం నష్టపోయి రూ.93.10ల కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.11:15ని.లకు షేరు 21శాతం నష్టంతో రూ.102.05ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.93.10లు, రూ.116.50లుగా నమోదయ్యాయి.
ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌:- నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ.2000ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో గత ముగింపు (రూ.219.09)తో పోలిస్తే ఏకంగా 21శాతం నష్టపోయి రూ.174ల కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:15ని.లకు షేరు 20శాతం నష్టంతో రూ.175ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.173.30లు, రూ.432.00లుగా నమోదయ్యాయి.



You may be interested

బ్యాంక్‌ నిప్టీ 1శాతం డౌన్‌..!

Friday 26th October 2018

యస్‌బ్యాంక్‌ భారీ పతనం కారణంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ శుక్రవారం దాదాపు 1శాతం నష్టపోయింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(24,817.45)తో పోలిస్తే అరశాతం నష్టంతో 24,673ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమాయనికి ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 12 షేర్లలో 7 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 4 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా యస్‌ బ్యాంక్‌ 6శాతం నష్టపోయి నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 లూజర్లలో

కళతప్పిన లోహ షేర్లు

Friday 26th October 2018

ముంబై:- మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో లోహ షేర్లు భారీ పతమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో లోహ సూచీ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతం నష్టపోయింది. ఉదయం గం.10:00లకు సూచి గత ముగింపు(3,307)తో పోలిస్తే 1.75శాతం నష్టంతో 3,262ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన మొత్తం 15 షేర్లలో 12 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్‌

Most from this category