STOCKS

News


ఈటీఎఫ్‌ల్లో దీర్ఘకాలం పెట్టుబడులతోనే అధిక రాబడులు

Monday 1st October 2018
Markets_main1538371326.png-20733

న్యూఢిల్లీ: ఈక్విటీ ఆధారిత ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లో దీర్ఘకాలం పాటు అంటే 5 నుంచి 10 పాటు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని ఈపీఎఫ్‌వో నియమించిన నిపుణుల ప్యానల్‌ అభిప్రాయపడింది. ఇలా చేస్తే ఆరు కోట్ల సభ్యులకు మెరుగైన రాబడులను అందించవచ్చని పేర్కొంది. మూడేళ్ల వరకు స్వల్ప కాలిక పెట్టుబడులు వద్దని సూచించింది. ఈపీఎఫ్‌వోకు సంబంధించిన ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ (ఎఫ్‌ఐసీ) సెప్టెంబర్‌ 19 నాటి సమావేశం అజెండాలో ఈ అంశంపై చర్చ జరగాల్సి ఉండగా... ఇది వాయిదా పడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై అక్టోబర్‌లో జరిగే సమావేశంలో చర్చించనున్నట్టు పేర్కొన్నాయి. చందాదారులకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అధిక వడ్డీ రేటును ఆఫర్‌ చేసేందుకు ఈపీఎఫ్‌వో ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2,886 కోట్ల విలువైన పెట్టుబడులను విక్రయించింది. రూ.1,054 కోట్ల పెట్టుబడులపై 16 శాతం రాబడులను సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాత సభ్యుల పెట్టుబడులపై 8.55 శాతాన్నే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటీఎఫ్‌ల్లో ఈపీఎఫ్‌వో పెట్టుబడులు రూ.40,000 కోట్లుగా ఉన్నాయి. 



You may be interested

అమెరికా వృద్ధి, రూపాయి పతనం.. ఎగుమతులకు అవకాశాలే

Monday 1st October 2018

న్యూఢిల్లీ: అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నాలుగేళ్లలోనే మెరుగైన స్థాయికి చేరడం, అదే సమయంలో రూపాయి విలువ పతనం అన్నవి మన దేశ ఎగుమతులకు మంచి అవకాశమని, నికర ఆదాయాలు పెరుగుతాయని అసోచామ్‌ అభిప్రాయపడింది. భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో 47.9 బిలియన్‌ డాలర్ల (రూ.3.35 లక్షల కోట్లు)విలువైన ఎగుమతులు అమెరికాకు జరిగినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ నిధుల ప్రణాళికకు ఇన్వెస్టర్ల ఆమోదం

Monday 1st October 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంతో కుదేలైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌)కి కాస్త ఊరట లభించే దిశగా దాదాపు రూ. 15,000 కోట్ల దాకా నిధుల సమీకరణ ప్రతిపాదనకు సంస్థలో ఇన్వెస్టర్లు ఆమోదముద్ర వేశారు. నాన్ కన్వర్టబుల్ డెట్ ఇష్యూ ద్వారా ఈ నిధులను సంస్థ సమీకరించనుంది. అలాగే రుణ సమీకరణ పరిమితిని రూ. 35,000 కోట్ల దాకా (40 శాతం మేర) పెంచుకునేందుకు, రైట్స్ ఇష్యూకి వీలుగా

Most from this category