STOCKS

News


2.6 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఎంబసీ రీట్‌​

Thursday 21st March 2019
Markets_main1553162948.png-24733

-ఏప్రిల్‌ మొదటివారంలో లిస్టింగ్‌
న్యూఢిల్లీ: మన దేశపు తొలి రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌) 2.57 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ రీట్‌ ద్వారా ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ సంస్థ రూ.4,750 కోట్లు సమీకరించింది. వ్యూహాత్మక, యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి ఈ సంస్థ ఇటీవలనే రూ.2,619 కోట్లు సమీకరించింది. ఒక్కో యూనిట్‌కు ప్రైస్‌బాండ్‌ గా రూ.299-300 ధరలను నిర్ణయించారు. 7.13 కోట్ల యూనిట్లను ఆఫర్‌ చేస్తుండగా, మొత్తం 18.35 కోట్ల యూనిట్లకు బిడ్‌లు వచ్చాయి. రీట్‌ యూనిట్లు వచ్చే నెల మొదటి వారంలో స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, బ్లాక్‌స్టోన్‌, రియల్టీ కంపెనీ ఎంబసీ గ్రూప్‌ కలసి ఎంబసీ ఆఫీస్‌ పార్క్‌ పేరుతో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీనే తొలి రీట్‌ను అందుబాటులోకి తెచ్చింది.



You may be interested

ఐటీ స్టాకులు ఇంకా ఆకర్షణీయమే!

Thursday 21st March 2019

సంపత్‌ రెడ్డి ఐటీ రంగ కంపెనీల షేర్ల వాల్యూషన్లు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయని, ఈ రంగంలో ఎర్నింగ్స్‌ గ్రోత్‌ కనిపిస్తోందని బజాజ్‌ అలియాన్జ్‌ సీఐఓ సంపత్‌ రెడ్డి చెప్పారు. క్రూడాయిల్‌ధర  పతనం, ఎఫ్‌ఐఐల ప్రవాహంలో రికవరీ, ఆర్‌బీఐ సహా వివిధ కేంద్ర బ్యాంకుల పాజిటివ్‌ ప్రకటనలు, దేశ ఎకానమీ పురోగమనంతో రెండు నెలలుగా రూపీ బలపడిందన్నారు. మరేదైనా భారీ అంతర్జాతీయ ఇబ్బంది తలెత్తితే తప్ప రూపీ స్థిరంగానే ఉండొచ్చని అంచనా వేశారు.

దేశీ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌ ‘స్విచ్‌ ఆఫ్‌’

Thursday 21st March 2019

మార్కెట్‌ అంతా విదేశీ కంపెనీలదే ప్రీమియం బ్రాండ్లూ కనుమరుగు అనూహ్యంగా మారిన స్మార్ట్‌ఫోన్‌ విపణి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మీకు గుర్తుందా.. దేశీయ మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్లు రూ.5 వేలలోపే స్మార్ట్‌ఫోన్లను అందించి భారత్‌లో సంచలనం సృష్టించాయి. ధరల పరంగా, ఫీచర్లతో దిగ్గజ బ్రాండ్లకు వణుకు పుట్టించాయి. ఒకానొక దశలో మొత్తం మార్కెట్లో దేశీయ బ్రాండ్లదే సింహభాగం. ఇదంతా గతం. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. దేశీయ బ్రాండ్లు కనుమరుగయ్యాయి. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌

Most from this category