STOCKS

News


ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ నుంచి రూ.5,000 కోట్ల రీట్‌

Tuesday 25th September 2018
personal-finance_main1537850731.png-20538

న్యూఢిల్లీ: రీట్‌ (రియల్‌ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌) ద్వారా రూ.5,000 కోట్ల సమీకరణకు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌, రియల్టీ సంస్థ ఎంబసీ గ్రూప్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు కంపెనీలు కలసి ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ పేరుతో ఒక జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఈ జేవీ రీట్‌ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ఆఫర్‌ డాక్యుమెంట్‌ను ఈ జేవీ ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇదే మన దేశపు తొలి రీట్‌  కానుంది. ఈ రీట్‌ ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించాలని, వీలైతే అదనంగా మరో 25 శాతం నిధులను కూడా సమీకరించాలని ఈ జేవీ యోచిస్తోంది. ఈ రీట్‌ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇష్యూకు వచ్చే అవకాశాలున్నాయి. మార్కెట్‌ పరిస్థితులు, వివిధ సంస్థల ఆమోదాల లభ్యతను బట్టి ఈ రీట్‌ ఎప్పుడు వచ్చేది ఆధారపడి ఉంటుంది. అద్దెలు వచ్చే రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను నిర్వహించే ఒక ఇన్వె‍స్ట్‌మెంట్‌ టూల్‌గా రీట్‌ను చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్‌ ఎవరైనా ఈ ప్లాట్‌ఫార్మ్‌పై ఇన్వెస్ట్‌ చేసి ఆదాయం పొందవచ్చు. 



You may be interested

టెలికం పరికరాలకు తప్పనిసరిగా సర్టిఫికేషన్‌

Tuesday 25th September 2018

బెంగళూరు: అధీకృత సంస్థలు పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేషన్ ఇచ్చిన పరికరాలను మాత్రమే టెలికం ఆపరేటర్లు ఉపయోగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ స్పష్టం చేశారు. అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే నిర్దేశిత నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి దేశీయంగా ఆపరేటర్లు దిగుమతి చేసుకునే ప్రతి పరికరానికి ఇండియన్ టెలిగ్రాఫ్ (సవరణ) చట‍్టం 2017 ప్రకారం పరీక్షలు తప్పనిసరి అని

బ్యాంకుల చీఫ్‌లతో నేడు జైట్లీ భేటీ

Tuesday 25th September 2018

న్యూఢిల్లీ: వార్షిక ఆర్థిక పనితీరు సమీక్షలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో భేటీ కానున్నారు. మొండిబాకీలను తగ్గించుకోవడానికి తీసుకుంటున్న చర్యల పురోగతితో పాటు పలు అంశాలు ఇందులో చర్చకు వస్తాయని  సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణ వృద్ధి, బాకీల రికవరీకి తీసుకుంటున్న చర్యలు, చట్టపరంగా ప్రభుత్వం అందించే తోడ్పాటు మొదలైనవి కూడా చర్చించే అవకాశం ఉందని వెల్లడించాయి. మొండిబాకీలను

Most from this category