STOCKS

News


ఐపీఓకు ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌

Saturday 13th October 2018
Markets_main1539419878.png-21135

  • ఇష్యూ విలువ రూ.1000 కోట్లు

ముంబై:- ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు ఇమామి సిమెంట్‌ లిమిటెడ్‌ కంపెనీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సెబి సమర్పించింది. ఈ ఐపీఓ ఇష్యూ ధర కంపెనీ మొత్తం రూ.1000 కోట్లను సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.500 కోట్ల విలువైన షేర్లు తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రస్తుత ప్రమోటర్లతో పాటు, షేర్‌ హోల్డర్లు సైతం అంతే విలువ కలిగిన ఈక్విటీ షేర్లను ఐపీఓలో విక్రయించనున్నారు.  ఈ ఇష్యూకు ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, సీఎల్‌ఎస్‌ఏ ఇండియా, ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, నోమురా ఫైనాన్స్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ కంపెనీలు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. సమీకరించిన నిధులను సాదారణ కార్పోరేషన్‌ ప్రయోజనాలకు, రుణ భారాన్ని  తగ్గించుకునేందుకు వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇష్యూ ప్రక్రియ పూర్తి చేసుకున్న పిమ్మట షేర్లను బీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రెండేళ్ల కిందట స్థాపించబడిన ఇమామి సిమెంట్‌ కంపెనీ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 5.60 మెట్రిక్‌ టన్నులుగా ఉంది. ప్రస్తుత కంపెనీ మూడు ఉత్పాదక యూనిట్లను కలిగింది.



You may be interested

దీపావళి కల్లా 11,000 స్థాయికి నిఫ్టీ!!

Saturday 13th October 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ దీపావళి కల్లా మళ్లీ 11,000 స్థాయికి చేరొచ్చని ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. మార్కెట్లు బౌన్స్‌బ్యాక్స్‌ అయ్యేట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. రూపాయి పతనం, క్రూడ్‌ ధరల ర్యాలీ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ వంటి అంశాల నేపథ్యంలో మార్కెట్లు అండర్‌పర్ఫార్మ్‌ చేస్తున్నాయని తెలిపారు. డౌజోన్స్‌ కరెక‌్షన్‌ అస్థిరతను

టెల్కోల ఎర్నింగ్స్‌ ఎలా ఉండొచ్చు?

Saturday 13th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజా నివేదిక ప్రకారం టెలికం, మీడియా కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు క్యూ2 ఆర్థిక ఫలితాలు ఎలా ఉండవచ్చొ ఒకసారి చూద్దాం.. కంపెనీ            క్యూ2 ఎర్నిం‍గ్స్‌ అంచనా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌    సూపర్‌గా ఉండొచ్చు డిష్‌ టీవీ వీడియోకాన్‌    యావరేజ్‌ ఈఎన్‌ఐఎల్‌        సూపర్‌గా ఉండొచ్చు మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌    యావరేజ్‌ భారతీ ఎయిర్‌టెల్‌    బలహీనంగా ఉండొచ్చు వొడాఫోన్‌ ఐడియా    బలహీనంగా ఉండొచ్చు భారతీ ఇన్‌ఫ్రాటెల్‌        బలహీనంగా ఉండొచ్చు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌,.....

Most from this category