STOCKS

News


సూచీలకు తాజా సవాళ్లు ఇవే..!

Tuesday 20th November 2018
Markets_main1542711221.png-22231

ముంబై: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు.. 2019 లోక్‌ సభ పోల్స్‌ కారణంగా స్టాక్‌ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకులు తప్పవని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ రీసెర్చ్ హెడ్‌ దీపెన్‌ సేత్‌ విశ్లేషించారు. అమెరికా డాలర్‌ కదలికలు, 82-83 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు ముడిచమురు ధరలు కీలకంగా ఉన్నాయని వివరించారు. స్వాతంత్రం వచ్చిన  ఏడు దశాబ్దాల తరువాత కూడా క్రూడ్‌ దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు డాలర్‌ పెరుగుదల ప్రభావం ప్రతికూలంగానే ఉంటుందన్నారు. యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అమితాబ్ చౌదరి నియమితులు కావడం వల్ల ఈ బ్యాంక్‌ పట్ల పాజిటీవ్‌గా ఉన్నట్లు చెప్పారు. ఐటీ రంగంలో అధిక వర్తకం అన్న చందంన్న ఉన్నప్పటికీ.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో మాత్రం ఎవర్‌గ్రీన్‌ రంగంగా ఉందన్నారు. ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, డిజిటల్‌ సవాళ్లను అనేక కంపెనీలు సమర్థవంతంగా ఎదుర్కుంటున్నట్లు చెప్పారయన.



You may be interested

రూపాయికి కొత్త సవాళ్లు..!

Tuesday 20th November 2018

ముంబై: కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య కీలక అంశాలన్నిటి మధ్యా సయోధ్య కుదిరి.. డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ఉదయం బలపడింది. ఈ ర్యాలీతో రూపాయి వరుసగా బలపడడం ఆరవ రోజుకు చేరుకుంది. గడిచిన 13 నెలల వరుస నష్టాలకు బ్రేక్‌ వేసింది. అయితే, తాజా సయోధ్య వల్ల రూపాయి ఒక సవాలును మాత్రమే అధిగమించిందని, అసలు సవాళ్లు ఇంకా ఉన్నాయని ఐఎన్‌జీ గ్రూప్‌ ఎకనమిస్ట్‌ ప్రకాష్ సక్‌పాల్

మూడురోజుల లాభాలకు బ్రేక్‌..!

Tuesday 20th November 2018

10700 దిగువకు నిప్టీ 300 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్‌ మార్కెట్‌ మూడురోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. ఐటీ, మెటల్‌, ఫార్మాషేర్ల క్షీణతతో సెన్సెక్స్‌ 300 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మళ్లీ 10700ల దిగువకు చేరుకుంది. డాలర్‌ మారకంలో రూపాయి రెండున్నర నెలల స్థాయికి బలపడింది. ఫలితంగా డాలర్‌ రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ,  ఫార్మా షేర్లు నష్టపోయాయి. ప్రపంచమార్కెట్లో మెటల్‌ షేర్ల పతన ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ మెటల్‌ షేర్లు క్షీణించాయి.

Most from this category