STOCKS

News


ఎన్నికల ముఖచిత్రం మారుతోందా... మరి మార్కెట్ల పరిస్థితి?

Monday 28th January 2019
Markets_main1548699900.png-23855

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాలు... ఇన్వెస్టర్లలో అప్పుడే ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రంలో అస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాల సంకేతాలు, ఇటీవలి కీలక రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఒత్తిడికి దారితీయవచ్చని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రభుదాస్‌ లీలాధర్‌ మార్కెట్‌ పట్ల అప్రమత్త ధోరణి వ్యక్తం చేసింది. హంగ్‌ ప్రభుత్వం, బలహీన భాగస్వాములతో ఏర్పడవచ్చని... థర్డ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అయితే, ప్రతీ రోజూ కష్టమేనని అభివర్ణించింది. ‘‘దేశ రాజకీయాలను 2019 ఓ మలుపుతిప్పేది అవుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదు’’అని ప్రభుదాస్‌ లీలాధర్‌ పేర్కొంది.  

 

‘‘యూపీ కీలకమైన రాష్ట్రం. 80 లోక్‌సభ స్థానాలు ఇక్కడే ఉన్నాయి. ఇటీవలి ఎస్‌పీ, బీఎస్‌పీ భాగస్వామ్యం సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. ఎన్నికల ముందస్తు ఎస్పీ-బీఎస్పీ భాగస్వామ్యం బీజేపీకి బలమైన సవాలు విసురుతోంది’’అని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. ఈ రెండు పార్టీలకు వేర్వేరు ఓట్‌ బేస్‌ ఉందని ఈ సంస్థ గుర్తు చేసింది. ‘‘2014 సాధారణ ఎన్నికల ఓట్ల శాతం ఆధారంగా చూస్తే బీఎస్పీ, ఎస్పీ ఓట్లను కలిపినట్టయితే... బీజేపీకి సీట్లు 35-50 శాతం మేర తగ్గిపోనున్నాయి. 2017 ఓట్ల శాతం ఆధారంగా చూసినా ఇదే తరహా ఫలితాలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ 140-150 సీట్లను చేరుకుని, తన ఆధ్వర్యంలో యూపీఏ సర్కారును ఏర్పాటు చేయడం కష్టంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్‌ 140-150 సీట్లను చేరుకోవడం సాధ్యమయ్యేట్టు లేదు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ఏర్పాటు కావడానికి ఈ మాత్రం సీట్లు అయినా అవసరం’’ అని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. పరిస్థితిని కాంగ్రెస్‌ ముందుగానే అంచనా వేసినట్టుందని, అందుకే ఇందిరాగాంధీ పోలికలతో ఉండే ప్రియాంకా గాంధీని యూపీ ప్రచారకర్తగా రంగంలోకి దింపడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

మార్కెట్ల గమ్యం?
‘‘ఎన్నికల ఫలితాలను ఊహించడం అంత సులభం కాదు. పెరిగిపోతున్న రాజకీయ అనిశ్చితులు దేశీయ, విదేశీ పెట్టుబడులను తగ్గేలా చేయవచ్చు. దీంతో ఎన్నికల ముందు మార్కెట్‌ రేటింగ్‌ తగ్గొచ్చు. ఇటీవల రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నష్టపోవడం, రాజకీయంగా ముఖ్యమైన యూపీలో ఎస్పీ-బీఎస్పీ మధ్య అధికారికంగా సీట్ల పంపకం ఒప్పందం కుదరడంతో 2019 సాధారణ ఎన్నికల అనంతరం అస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయన్న ఆందోళలు ఇన్వెస్టర్లలో పెరుగుతున్నాయి’’అని బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. బీజేపీ ఓటు శాతం 5 శాతం తగ్గి, ఎస్పీ-బీఎస్పీ ఓట్ల మధ్య స్థిరీకరణ నూరు శాతం జరిగితే బీజేపీ 50 సీట్లను కోల్పోవచ్చని అంచనా వేసింది. ఇండియాటుడే-కార్వీ, ఏబీపీ-సీ ఓటర్‌ తాజా సర్వేల్లో ఎన్‌డీఏకు 230-240 వరకు వస్తాయని వెల్లడైన విషయం గమనార్హం. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 272. ఎన్నికల వరకు నిఫ్టీ50 రేంజ్‌బౌండ్‌గా ఉటుందని, 10,000 మద్దతు స్థాయిగా ప్రభుదాస్‌ లీలాధర్‌ పేర్కొంది. మొదటి ఆరు నెలలు మార్కెట్ల పట్ల అప్రమత్త ధోరణి వ్యక్తం చేస్తున్నామని కోటక్‌ తెలిపింది.You may be interested

కార్మికులకు కనీస పెన్షన్‌ రూ.2,000?

Monday 28th January 2019

ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌) కింద ఇస్తున్న కనీన పింఛన్‌ను రూ.2,000 చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు ఈపీఎస్‌లో భాగమన్న విషయం తెలిసిందే. కనీసం పదేళ్ల సర్వీసు ఉండి, రిటైర్‌ అయిన కార్మికులకు ఈపీఎఫ్‌వో పరిధిలోని ఈపీఎస్‌ పథకం కింద పెన్షన్‌ అందుతుంది. అత్యున్నత స్థాయిలోని కమిటీ కనీస పెన్షన్‌ పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ

డెబిట్‌ కార్డు కేవలం ఏటీఎం కోసమే కాదు..!

Monday 28th January 2019

డెటిట్‌ కార్డును మన దేశంలో ఇప్పటికీ ఎక్కువ మంది ఏటీఎం కార్డుగానే భావిస్తున్నారు. కేవలం ఏటీఎంల నుంచి డబ్బుల ఉపసంహరణ కోసమే వినియోగిస్తున్నారు. డెబిట్‌ కార్డులను అన్ని రకాల డిజిటల్‌ లావాదేవీలు, కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చన్న విషయం తెలిసిన వారు తక్కువే! ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం మన దేశంలో 99 కోట్లకు పైగా డెబిట్‌ కార్డులు వినియోగంలో ఉన్నాయి. ఇందులో 70 శాతం కార్డులు అంటే సుమారు 70 కోట్ల కార్డులను

Most from this category