STOCKS

News


పరిస్థితులు మారుతున్నాయ్‌.. కొనడానికి రెడీనా?

Friday 9th November 2018
Markets_main1541751637.png-21823

క్రూడ్‌ ధరలు దిగిరావడం, లిక్విడిటీ సమస్యలు తగ్గడం వంటి సానుకూలతల నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోలుకు అవకాశాలున్నాయని ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌) నిశ్చల్‌ మహేశ్వరి తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో కొనుగోలుదారుడిగానే ఉంటాను. కేవలం ముడిచమురు ధరలు మాత్రమే కాదు.. దేశీయంగా, అంతర్జాతీయంగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. డాలర్‌ కూడా బలహీనపడుతోంది. ఇది మరొక సానుకూల అంశం. అలాగే రానున్న రోజుల్లో రేట్లు పెంపు ఉండొచ్చు’ అని వివరించారు. డాలర్‌ బలహీనత వర్ధమాన దేశాలకు సానుకూలమని తెలిపారు. ఇక దేశీయంగా చూస్తే లిక్విడిటీ సంక్షోభం కొలిక్కి వస్తోందని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ మార్కెట్‌లో పరిస్థితులను చక్కదిద్దుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మార్కెట్లు 10-12 శాతంమేర కరెక‌్షన్‌కు గురికావడం వల్ల కొనుగోలుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డారు. 
రేటింగ్‌ ఏజెన్సీల విషయానికి వస్తే.. అవి గొప్ప చరిత్రను కలిగి లేవని నిశ్చల్‌ మహేశ్వరి గుర్తుచేశారు. క్రూడ్‌ కావొచ్చు.. డాలర్‌ కావొచ్చు.. సమస్యలు పరిష్కారమౌతున్నాయని తెలిపారు. రూపాయిపై ఇదివరకటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వృద్ధి రేటు రానున్న రోజుల్లో బలంగా ఉండకపోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం ఇండియన్‌ ఎకానమీ మంచి స్థాయిలో నిలుచుందని పేర్కొన్నారు.  
ఎఫ్‌ఐఐలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని నిశ్చల్‌ మహేశ్వరి పేర్కొన్నారు. లిక్విడిటీ సమస్య మాత్రమే కాదని, 2019 ఎన్నికల వరకు వీళ్లు ఇదే ధోరణిలో ఉండొచ్చని తెలిపారు. ఎఫ్‌ఐఐలు భారత్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తారని అనుకోవడం లేదన్నారు. ప్రపంచంలో చైనా, బ్రెజిల్‌ వంటి పలు వర్ధమాన మార్కెట్లు చౌకగా ఉన్నాయని, ఎఫ్‌ఐఐలు వీటిపై దృష్టి కేంద్రీకరించొచ్చని పేర్కొన్నారు. భారత్‌లోకి ఎఫ్‌ఐఐలు తిరిగి రావడానికి మరికొంత కాలం పడుతుందని తెలిపారు. 
కార్పొరేట్‌ బ్యాంకుల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని నిశ్చల్‌ మహేశ్వరి సిఫార్సు చేశారు. ఇవి మంచి పనితీరు కనబరుస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ లేదా ఎస్‌బీఐలను ఎంచుకోవచ్చని సూచించారు. మెటల్స్‌ మంచి పనితీరు కనబరుస్తాయని తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ లేదా హిందాల్కోకు ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొన్నారు. ఐటీ విభాగం మిశ్రమంగా ఉండొచ్చని తెలిపారు. You may be interested

అటోమొబైల్‌ షేర్ల ర్యాలీ

Friday 9th November 2018

మార్కెట్‌ లాభనష్టాల ట్రేడింగ్‌లో భాగంగా శుక్రవారం మిడ్‌సెషన్‌ అనంతరం అటో రంగ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో అటోరంగ షేర్ల ఉత్సాహానిచ్చాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్‌ నేటి ట్రేడింగ్‌లో 1.50శాతం లాభడింది. మధ్యాహ్నం గం.2:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(9,219.50)తో పోలిస్తే 1శాతం లాభంతో 9,350 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలోని మొత్తం 16 షేర్లకు గానూ,

ఫలితాలు చూసి నిపుణులు మెచ్చిన షేర్లు ఇవే..!

Friday 9th November 2018

గడిచిన నెలరోజుల్లో దేశీ సూచీలు 2 శాతానికి మించి లాభాలను సాధించాయి. ప్రత్యేకించి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాల వెల్లడి తరువాత సూచీలు భారీ లాభాలను నమోదుచేశాయి. అయితే, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 8 శాతం వరకు లాభపడిన నేపథ్యంలో ప్రధాన ఇండెక్స్‌లు ఫ్రెంట్‌లైన్‌ స్టాక్స్‌ను అవుట్‌పెర్ఫార్మ్‌ చేశాయి. మరోవైపు ఆకర్షణీయమైన విలువ, స్థిర ఆదాయాలు ప్రకటించిన పలు కంపెనీలు ప్రధాన సూచీలను మించి లాభపడ్డాయి.

Most from this category