STOCKS

News


రెండంకెల్లో రాబడులకు ఎడిల్‌వీజ్‌ బెట్స్‌

Wednesday 6th March 2019
Markets_main1551868948.png-24457

ప్రపంచ మార్కెట్లకు భౌగోళిక ఉద్రిక్తతలు, వృద్ధి మాంద్యం వంటి రిస్క్‌లు వున్నాయని, అయితే ఏడాదికాలంగా భారీగా పతనమైన మిడ్‌క్యాప్‌ షేర్లలో కొన్ని రానున్న రోజుల్లో మంచి రాబడులు ఇచ్చే అవకాశం వుందని బ్రోకరేజ్‌ సంస్థ ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 2017లో పెద్ద ర్యాలీ జరిపి, 2018లో భారీ పతనాన్ని చవిచూసి, ఈ ఏడాది కూడా ఇప్పటివరకూ క్షీణిస్తూ వచ్చిన కొన్ని మిడ్‌క్యాప్‌ షేర్లు కొనుగోలుకు అనుకూలంగా వున్నాయని ఎడిల్‌వీజ్‌ వివరించింది. రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌ (ఆర్‌ఓసీఈ) 15కుపైగా సాధించే కంపెనీలు కొద్దికాలం పతనమైనా, వేగంగా కోలుకోగలుగుతాయని, 2008, 2009 సంవత్సరాల్లో ఇదే జరిగిందని, ఈ కారణంగా తాము ఆర్‌ఓసీఈ, కార్పొరేట్‌ ప్రమాణాలు తదితర అంశాల కారణంగా రెండంకెల్లో రాబడినిచ్చే సత్తా కలిగిన 10 షేర్లను పెట్టుబడికి ఎంపికచేసినట్లు ఎడిల్‌వీజ్‌ తెలిపింది. ఆ 10 షేర్లూ ఇవే...
అవంతి ఫీడ్స్, క్రాంప్టన్‌ గ్రీవ్స్, దీపక్‌ నైట్రేట్, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్, హెరిటేజ్‌ ఫుడ్స్, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, లుమాక్స్‌ ఇండస్ట్రీస్, పీఎస్‌పీ ప్రాజెక్ట్స్, సాగర్‌ సిమెంట్స్, ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌. ఈ షేర్లు ఏడాదికాలంలో 22 శాతం నుంచి 61 శాతం వరకూ లాభాలందించే ఛాన్స్‌ వుందని బ్రోకరేజ్‌ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.  
 



You may be interested

ఎన్నికల ముందస్తు ర్యాలీయేనా?

Thursday 7th March 2019

మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు ర్యాలీ చేయడం ఆరంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారం నెలబెట్టుకునే అవకాశాలు పెరగడమే దీనికి కారణమన్నది విశ్లేషకుల అంచనా. పాకిస్థాన్‌ చర్యలపై మోదీ సర్కారు అనుసరించిన విధానంతో గెలుపు అవకాశాలు పెరిగాయని ఎక్కువ మంది విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి స్టాక్స్‌లో ఎన్నికల ముందుస్తు ర్యాలీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.    మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్స్‌ 2013 నుంచి 2018 మధ్య

లాభాలు కొనసాగాయ్‌

Wednesday 6th March 2019

11050పై నిఫ్టీ ముగింపు మూడరోజూ లాభాలే. ప్రపంచ మార్కెట్లలలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., దేశీయ మార్కెట్లో మూడోరోజూ లాభాలు కొనసాగాయి. ఆర్థిక ఐటీ, ఫార్మా, మెటల్‌ షేర్ల అండతో  సెన్సెక్స్‌ 193 పాయింట్లు పెరిగి 36,636 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 11,053 ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 72 పాయింట్ల స్వల్ప లాభంతో 27,625 ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అటో, మీడియా షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన

Most from this category