STOCKS

News


ఎడిల్‌వీజ్‌ టాప్‌ బెట్స్‌

Wednesday 6th February 2019
Markets_main1549448591.png-24050

మార్కెట్‌ పట్ల తాము జాగురూకతతో వున్నామని, అయితే తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల కారణంగా ఏడాదికాలంలో వినియోగ, గ్రామీణ సంబంధిత షేర్లు మంచి పనితీరు కనపర్చవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ ఎడిల్‌వీజ్‌ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2019 జూన్‌కు తాము గతంలో నిర్దేశించిన 9800-10,500 నిఫ్టీ టార్గెట్‌ శ్రేణిలో ఎటువంటి మార్పూ లేదని, కానీ ఎంపికచేసిన షేర్లు రాబడులనిచ్చే అవకాశం వుందని ఎడిల్‌వీజ్‌ వివరించింది. ఈ నేపధ్యంలో ఈ బ్రేకరేజ్‌...8 లార్జ్‌క్యాప్‌ షేర్లను, 6 మిడ్‌క్యాప్‌ షేర్లను ఎంపికచేసింది. అవి...

లార్జ్‌క్యాప్స్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, నెస్లే ఇండియా, డాబర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌, దివీస్‌ లాబ్‌

మిడ్‌క్యాప్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, గుజరాత్‌ స్టేట్‌ పెట్రోనెట్‌, పీఐ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌ లాల్‌ పాథ్‌లాబ్స్‌, టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌, అపోలో హాస్పిటల్స్‌

 



You may be interested

4నెలల గరిష్ట స్థాయి వద్ద ముగింపు

Wednesday 6th February 2019

ఐదోరోజూ లాభాల ముగింపే 11050పైన నిఫ్టీ ముగింపు 358 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలకు తోడు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లపై కోత ఉండచవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ప్రధాన రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సూచీలు 4నెలల గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. వరుసగా ఐదోరోజూ ర్యాలీ చేసిన సెన్సెక్స్‌ 358 పాయింట్లు లాభపడి 36,975 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లను

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 8 శాతం అప్‌

Wednesday 6th February 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు వరుసగా రెండోరోజూ లాభపడ్డాయి. బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో బుధవారం 8శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.365.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించింది. ఎస్సాల్‌ గ్రూప్‌ ప్రమోటర్లు ఈ గ్రూప్‌నకు చెందిన ఆరు లిస్టెడ్‌ కంపెనీల్లో తమ వాటాల నుంచి కొంత మేర ఓపెన్‌ మార్కెట్లో విక్రయించారు. తద్వారా రూ.1050 కోట్లను ప్రమోటర్లు సమకూర్చుకున్నారు. జవనరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య

Most from this category