STOCKS

News


ఈసీఎల్‌ ఫైనాన్స్‌ ఎన్‌సీడీ ఇష్యూ పూర్తి

Saturday 5th January 2019
Markets_main1546686427.png-23436

హైదరాబాద్‌: ఎడెల్‌వీజ్‌ గ్రూపునకు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఈసీఎల్‌ ఫైనాన్స్‌... సెక్యూర్డ్‌ ఎన్‌సీడీల ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్లకు పైగా నిధులను సమీకరించింది. రిటైల్‌ విభాగంలో అధిక స్పందన లభించింది. ఈ విభాగం నుంచే రూ.500 కోట్లు లభించాయి. 1.78 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. హై నెట్‌వర్త్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి రూ.230 కోట్లు సమకూరాయి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో తమ ఎన్‌సీడీ ఇష్యూకు వచ్చిన స్పందన అద్భుతంగా ఉందని, 73 శాతం చందాలు 5-10 ఏళ్ల కాలానికి వచ్చినవేనని ఎడెల్‌వీజ్‌ గ్రూపు సీవోవో హిమాన్షు కాజి తెలిపారు.



You may be interested

ఈ వారం ఎలా ఉండొచ్చు?

Saturday 5th January 2019

గత వారం మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లు చవిచూశాయి. నిఫ్టీ అధోముఖ వాలు రేఖ వద్ద పదే పదే నిరోధాన్ని ఎదుర్కొంది. వారమంతా యత్నించినా సూచీలు భారీ అప్‌మూవ్‌ జరపలేకపోయాయి. అయితే వారం మొత్తం మీద డెరివేటివ్స్‌లో భారీగా షార్ట్స్‌ పెరిగాయి. కానీ షార్ట్‌ కవరింగ్‌ మాత్రం జరగలేదు. ఈ వారం షార్ట్స్‌లో కవరింగ్‌కు ఛాన్సులున్నాయి. నిఫ్టీ గతవారాన్ని తన 50 రోజుల డీఎంఏ స్థాయి 10753 పాయింట్లకు దిగువన ముగించింది.

నోకియా నుంచి మరో​ ఫోన్‌

Saturday 5th January 2019

న్యూఢిల్లీ: హెచ్‌ఎండీ గ్లోబల్‌ కంపెనీ నోకియా 106 మోడల్‌ ఫీచర్‌ ఫోన్‌ను భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మంచి బ్యాటరీ లైఫ్‌, చూడ్డానికి సింపుల్‌గా, మన్నికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 17.7 గంటల టాక్‌టైమ్‌, 21 రోజుల స్టాండ్‌బై టైమ్‌తో ఈ ఫోన్‌ లభిస్తుంది. మైక్రో యూఎస్‌బీ చార్జర్‌ ద్వారా చార్జ్‌ చేసుకోవచ్చు. డార్క్‌ గ్రే రంగులో లభించే ఈ ఫోన్‌ ధర రూ.1,299.

Most from this category