STOCKS

News


7 రోజుల రికార్డు పరుగు!

Friday 23rd November 2018
Markets_main1542947674.png-22320

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ పటిష్ట రీతిన బలపడుతోంది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో గురువారం ఒకేరోజు 77 పైసలు లాభపడి 70.69 వద్ద ముగిసింది.  రూపాయి రికవరీ బాటన పయనించడం వరుసగా ఇది ఏడవరోజు. ఈ కాలంలో భారీగా 220 పైసలు లాభపడింది. బ్యాంకర్లు, ఎగుమతిదారులు డాలర్లను భారీగా విక్రయించడం కొనసాగిస్తున్నారు.  గురువారం రూపాయి ప్రారంభంతోటే 71.12 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.68 వద్దకూ రికవరీ అయ్యింది. మంగళవారం రూపాయి ముగింపు 71.46. బుధవారం మిలాద్‌ ఉల్‌ నబీ సందర్భంగా సెలవు.

బలోపేతానికి కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరల భారీ పతనం, విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతుండడం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి తక్షణ కారణాలు. అంతర్జాతీయ వృద్ధి మందగమనానికి అవకాశం ఉందని అమెరికా ఫెడ్‌ తాజా వ్యాఖ్యలు, దీనితో రెండు వారాల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారిన డాలర్‌ ఇండెక్స్‌ రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ వ్యూహకర్త ఆనంద్‌ జేమ్స్‌ అభిప్రాయపడ్డారు.  


 



You may be interested

టెలికం కార్యదర్శితో బిర్లా భేటీ

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: దిగ్గజ టెల్కో వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా గురువారం కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌తో మరోసారి భేటీ అయ్యారు. వొడాఫోన్‌ ఐడియా సీనియర్ అధికారులు, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వైస్‌-చైర్మన్ హిమాంశు కపానియా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టెలికం రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు అరగంట పాటు సమావేశం జరిగింది. అయితే, చర్చల వివరాలను

నష్టాల్లో ఆసియా మార్కెట్లు..

Friday 23rd November 2018

ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం దాదాపుగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే జపాన్‌ మార్కెట్‌కు సెలవు. గురువారం జపాన్‌ నికాయ్‌ 225.. 139 పాయింట్ల లాభంతో 21,646 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 32 పాయింట్ల నష్టంతో 9,682 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ కేవలం 1 పాయింటు నష్టంతో 3,039 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 43

Most from this category