STOCKS

News


ఎర్నింగ్స్‌ గ్రోత్‌ ఆదుకుంటుంది!

Monday 14th January 2019
Markets_main1547455947.png-23576

ఈక్విటీలపై గ్లోబల్‌ బ్రోకరేజ్‌ల అంచనా
దేశీయ ఈక్విటీల్లో వాల్యూషన్లు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి.అయితే స్థూల ఆర్థికాంశాలు , కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ మెరుగుపడడంతో ఈక్విటీలకు ఇబ్బంది ఉండదని విదేశీ బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఈక్విటీలు లాభాల్లోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఎన్నికల వేళ కాస్త ఒడిదుడుకులు కనిపించినా, లాంగ్‌టర్మ్‌లో లాభాలే ఉంటాయని తెలిపాయి. ఇందుకు దారి తీసే కారణాలను వివరించాయి.
1. ఎర్నింగ్స్‌ వృద్ధి: గత కొన్నేళ్లుగా కొంతమేర ఎర్నింగ్స్‌ మెరుగుపడుతూ ఉన్నా, ఎఫ్‌పీఐలు మాత్రం ఈ ఏడాదే ఆశావహంగా ఉన్నాయి. ఈ ఏడాది నిఫ్టీ ఎర్నింగ్స్‌ వృద్ధి 18- 20 శాతం ఉండొచ్చని సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. ప్రధానంగా కార్పొరేట్‌ బ్యాంక్స్‌ మంచి ఫలితాలిస్తాయని తెలిపింది. క్రెడిట్‌ సూసీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. గత సంస్కరణల ఫలాలు అందే సమయం వచ్చిందని తెలిపింది.
2. వాల్యూషన్లు: ప్రస్తుతం నిఫ్టీ వాల్యూషన్‌ 17 రెట్లుంది. పదేళ్ల సరాసరి ఈపీఎస్‌ అంచనాల కన్నా ఇది 11 శాతం అధికం. ఇతర వర్ధమాన దేశాల పీఈతో పోలిస్తే ఇండియా ఈక్విటీల పీఈ ఇప్పటికీ 66 శాతం ఎక్కువగాఉంది. అందువల్ల ఇప్పటికి వాల్యూషన్లు కాస్త ఎక్కువగానే ఉన్నట్లు భావిస్తున్నామని క్రెడిట్‌సూసీ తెలిపింది. ఎన్నికల్లో బలహీన ప్రభుత్వం వస్తే ఈ వాల్యూషన్లకు న్యాయం జరగక, డీరేటింగ్‌కు దారితీయవచ్చని హెచ్చరించింది.
3. ఎన్నికలు: గత మూడు సందార్భల్లో ఎన్నికల అనంతరం ఈక్విటీలు అదరగొట్టాయి. అందువల్ల లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్టర్లు ఎన్నికల వేళ తలెత్తే స్వల్ప ఒడిదుడుకులకు భయపడాల్సిన పనిలేదని బ్రోకరేజ్‌ సంస్థలు చెబుతున్నాయి. ఎన్నికల అనంతరం కన్జూమర్‌ సంస్థలు, ఎనర్జీ, ఇండస్ట్రియల్స్‌ కంపెనీలు మంచి ప్రదర్శన చూపుతాయని అంచనా వేస్తున్నాయి. ఎన్నికల అనంతరం గ్లోబల్‌ సెక్టార్లు మంచి ప్రదర్శన చూపాయని డాయిష్‌బ్యాంక్‌ తెలిపింది.
4. అంతర్జాతీయ లిక్విడిటీ: క్రమంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ ఉద్దీపనలను ఉపసంహరించుకుంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కొంతమేర లిక్విడిటీ కొరత ఉండొచ్చని బ్రోకరింగ్‌ సంస్థల అభిప్రాయం. లిక్విడిటీ కుంచించుకుపోవడం స్పీడందుకుంటే దేశీయ ఈక్విటీలపై ప్రభావం పడుతుందని బోఫాఎంఎల్‌ అంచనా వేస్తోంది. 
దీంతో పాటు లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే ప్రస్తుతం చిన్న స్టాకుల వాల్యూషన్లు చౌకగా ఉన్నాయని, ఇవి ఇకమీదట మంచి ప్రదర్శన చూపవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేశాయి. You may be interested

భారీ పతనాలుండవు!

Monday 14th January 2019

బిఎన్‌పీ పారిబా అంచనా దేశీయ మార్కెట్లో సమయానుగత దిద్దుబాట్లే తప్ప భారీ పతనాలు ఈ ఏడాది ఉండకపోవచ్చని బీఎన్‌పీ పారిబా ప్రతినిధి అభిజిత్‌ డే అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరాన్ని రెండు భాగాలుగా పరిశీలిస్తే ప్రథమార్ధంలో ట్రేడ్‌వార్‌, ఫెడ్‌ చర్యలు, ఎన్నికల ఫలితాల్లాంటి స్థూల ఆర్థికాంశాలు, ద్వితియార్ధంలో ఎర్నింగ్స్‌ రికవరీ లాంటి సూక్ష్మ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. ఎర్నింగ్స్‌ గ్రోత్‌తో పాటు సంస్కరణల ఫలాలు అందుకునేందుకు తగిన సంసిద్ధత, వినిమయ ఆధారిత ఎకనమిక్‌

8నెలల కనిష్టానికి డబ్ల్యూపీఐ గణాంకాలు

Monday 14th January 2019

ఆహార పదార్థాలు, చమురు ధరలు శాంతించడంతో డిసెంబర్‌ టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) 8నెలల కనిష్టానికి దిగివచ్చింది. నవంబర్‌లో 4.64 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్‌లో భారీ తగ్గి 3.80 శాతానికి పరిమితమైంది. గతేడాది డిసెంబర్‌లో 3.58 శాతంగా నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన  గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రొడెక్టుల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.21 శాతంగా నమోదు కాగా, డిసెంబర్‌ నాటికి 3.59 శాతానికి

Most from this category