STOCKS

News


ఈ మూడు రంగాల కంపెనీలకే మంచి లాభాలు

Wednesday 17th April 2019
Markets_main1555488388.png-25185

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు రంగాల్లోని కంపెనీలు మంచి లాభాల్ని ఆర్జించే అవకాశం వుందని తాము అంచనావేస్తున్నట్లు కొటక్‌ మహింద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షిబాని సర్కార్‌ కురియన్‌ చెప్పారు. ఆమె ఒక అంగ్లచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత మూడేళ్ల నుంచి కార్పొరేట్‌ లాభాల్లో పెద్దగా వృద్ధిలేదని, అయితే 2018-19 క్యూ4లో కొంతవరకూ ఎర్నింగ్స్‌ మూమెంటమ్‌ వుంటుందన్న అంచనాలు వున్నాయన్నారు. ఈ క్రమంలో 2019.20లో వృద్ధి 16-18 శాతం వుండవచ్చని తాము అంచనావేస్తున్నామని, ఈ వృద్ధిని ప్రధానంగా మూడు రంగాలు చేకూరుస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. అవి ఫైనాన్షియల్స్‌, సిమెంటు, క్యాపిటల్‌ గూడ్స్‌.  ఈ నేపథ్యంలో తాము ఫైనాన్షియల్స్‌పై ఓవర్‌వెయిట్‌తో వున్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ లాభాల విషయంలో ఇవే ముందుంటాయని అంచనావేస్తున్నామన్నారు. వీటిలో రిటైల్‌ ప్రైవేటు బ్యాంకులు క్రమమైన వృద్ధిని కనపర్చవచ్చని, ప్రత్యేకించి కార్పొరేట్‌ బ్యాంకులు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీ వృద్ధి నమోదుచేయవచ్చని భావిస్తున్నామని ఆమె వివరించారు. రుణవ్యయాలు తగ్గడం, మొండిబకాయిలు బాటమ్‌అవుట్‌కావడం, కేటాయింపులు తగ్గడం ఇందుకు కారణాలని తెలిపారు. అందువల్ల ఈ విభాగం పట్ల తమ అనుకూలత కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇక సిమెంటు రంగం విషయానికొస్తే ఈ రంగం లాభదాయకత మెరుగుపడే సూచనలు కన్పిస్తున్నాయని, అది ఈ క్వార్టర్‌ నుంచే ఆరంభం కాగలదన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకించి దక్షిణాదిన సిమెంటు ధరలు పెరుగుతుండటం తాము గమనించామని, అమ్మకాల పరిమాణం స్థిరంగా వుందని, ఈ నేపథ్యంలో సిమెంటు రంగం లాభదాయకత మెరుగుపడనున్నందున, ఈ రంగంపై పాజిటివ్‌గా వున్నామన్నారు. ఇక క్యాపిటల్‌గూడ్స్‌ రంగానికి సంబంధించి, ఇప్పుడిప్పుడే ఆర్డర్ల ఫ్లో పెరుగుతుందని, సామర్థ్య వినియోగంలో మార్జిన్ల మెరుగుదల కనపడుతుందని షిబాని వివరించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పనితీరును చూడదగ్గ రంగం ఇదని ఆమె తెలిపారు. You may be interested

మళ్లీ రూ.8 లక్షల కోట్ల క్లబ్‌లోకి టీసీఎస్‌

Wednesday 17th April 2019

దేశీయ ఐటీ సేవల రంగంలో అగ్రగామి సంస్థ వెలుగొందుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) మళ్లీ రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌క్యాప్‌ క్లబ్‌లోకి చేరుకుంది.  ఈ షేరు గత రెండు రోజుల్లో 5 శాతానికిపైగా ర్యాలీ జరపడంతో మార్కెట్‌ క్యాపిటిలైజేషన్‌ మంగళవారం రూ.8లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది తొలిసారిగా ఈ క్లబ్‌లోకి చేరిన టీసీఎస్‌... కొద్ది నెలల క్రితం ఈ ట్యాగ్‌ను కోల్పోయింది.  తిరిగి నిన్న బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో టీసీఎస్‌ షేరు 1.06శాతం లాభపడి రూ.2132.45ల

అంచనాల్ని మించిన చైనా జీడీపీ...కుదుటపడిన మార్కెట్లు

Wednesday 17th April 2019

మార్చి క్వార్టర్లో చైనా జీడీపీ వృద్ధి అంచనాల్ని మించి నమోదుకావడంతో ఆసియా మార్కెట్లు స్థిరంగా ముగిసాయి. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చైనా స్థూల ఆర్థిక వ్యవస్థ 6.4 శాతం వృద్ధిచెందినట్లు అధికారిక డేటా వెలువడింది. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధ ప్రభావంతో చైనా జీడీపీ వృద్ధి 6.3 శాతం దిగువన నమోదుకావొచ్చంటూ పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు అంచనావేశాయి. ఈ ఏడాది తమ వృద్ధి రేటు 6–6.5 శాతానికి

Most from this category