STOCKS

News


డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ : అప్పర్‌ సర్క్యూట్‌

Friday 9th November 2018
Markets_main1541742885.png-21817

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా షేరు శుక్రవారం 10శాతం లాభపడి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఏపీలో విశాఖపట్టణం కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే డీసీఐఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 73.44శాతం వాటా శాతం ఉంది. నిధుల సమీకరణలో భాగంగా ఈ కంపెనీలో ప్రభుత్వానికి ఉ‍న్న మొత్తం వాటాను విశాఖపట్టణం పోర్ట్‌ట్రస్ట్‌, పారదీప్‌ పోర్ట్‌ట్రస్ట్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ట్రస్ట్‌, కాండ్లా పోర్ట్‌ట్రస్ట్‌ల కన్సార్షియానికి విక్రయించేందుకు కేంద్ర కేబినేట్‌ గురువారం ఆమోదించినట్లు ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో నేడు ఇన్వెస్టర్లు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేరు 10శాతం ర్యాలీ చేసి రూ.384 వద్ద ఫ్రీజయ్యింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్టధరలు వరుసగా రూ. 286.60 రూ.920.00లుగా నమోదయ్యాయి.



You may be interested

మూడీస్‌ వాచ్‌లిస్ట్‌లో ఎయిర్‌టెల్‌.. షేరు 5% డౌన్‌

Friday 9th November 2018

దేశీ ప్రముఖ టెలికం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌పై హాంగ్‌ కాంగ్‌కు చెందిన మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ప్రధానంగా దృష్టి పెట్టింది. భారతీ ఎయిర్‌టెల్‌ని రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ వాచ్‌లిస్ట్‌లో ఉంచింది. అంటే కంపెనీ పనితీరు సంతృప్తికరంగా లేకపోతే రేటింగ్‌లో కోత విధిస్తుంది. లాభదాయకత తక్కువ స్థాయిల్లో ఉండటం, క్యాష్‌ఫ్లో బలహీనంగా ఉండొచ్చనే అంచనాలు ఇందుకు కారణమని మూడీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ క్రెడిట్‌ ఆఫీసర్‌ అన్నాలిసా డిచియరా తెలిపారు. తీవ్రమైన

డీసీఐఎల్‌లో వ్యూహాత్మక విక్రయాలకు లైన్‌ క్లియర్‌!

Friday 9th November 2018

న్యూఢిల్లీ: నాలుగు నౌకాశ్రయాల కన్సార్షియంకు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐఎల్‌)లో ప్రభుత్వ వాటాల వ్యూహాత్మక విక్రయాలకు గురువారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం డీసీఐఎల్‌లో ప్రభుత్వానికి 73.44 శాతం వాటా ఉంది. ‘‘డీసీఐఎల్‌లో పూర్తి 100 శాతం వాటాలను విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌, పారాదీప్‌ పోర్ట్‌ ట్రస్ట్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌ ట్రస్ట్‌, కాండ్లా పోర్ట్‌ ట్రస్ట్‌లకు విక్రయించడానికి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల

Most from this category