STOCKS

News


డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 10 శాతం క్రాష్‌

Monday 16th July 2018
Markets_main1531722267.png-18342

డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరెటరీస్‌ షేరు ట్రేడింగ్‌ మార్నింగ్‌ సెషన్‌లో 10 శాతనికిపైగా పడిపోయింది. న్యూజెర్సీ డిస్ట్రిక్‌ కోర్టు తన ప్రాథమిక దర్యాప్తులో పేటెంట్‌ నెం.9,931,305కి సంబంధించి కంపెనీకి వ్యతిరేకంగా తాత్కాలిక ఉత్తర్వులను జారీచేసింది. దీనివల్ల పేటెంట్‌ సమస్య తీరేంతవరకు రెడ్డీస్‌ ల్యాబ్స్‌కి అమెరికా మార్కెట్‌లో సుబొక్సొన్‌ జెనరిక్‌ను విక్రయించడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో రెడ్డీస్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి 15 నిమిషాల్లోనే 10.7 శాతానికిపైగా పడిపోయింది. ఇదే నిఫ్టీ టాప్‌ లూజర్‌. న్యూజెర్సీ డిస్ట్రిక్‌ కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేస్తామని రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ తెలిపింది. కాగా యూఎస్‌ ఎఫ్‌డీఏ నుంచి జూన్‌ 15న తుది అనుమతులు పొందిన తర్వాత డాక్టర్‌ రెడ్డీస్‌ గత శుక్రవారం రోజు సుబొక్సొన్‌ డ్రగ్‌ను అమెరికా మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అయితే సుబొక్సొన్‌ డ్రగ్‌ను కనుగొన్న ఇండివియర్‌ సంస్థ పేటెంట్‌ విషయం కొలిక్కి వచ్చేంతవరకు డాక్టర్‌ రెడ్డీస్‌ను సుబొక్సొన్‌ డ్రగ్‌ను అమెరికాలో విక్రయించకుండా తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును ఆశ్రయించింది.  
కాగా 11:48 గంటల సమయంలో రెడ్డీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8.62 శాతం క్షీణతతో 2,120 వద్ద ట్రేడవుతోంది. 

ఈ వార్తల నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌ సంస్థల డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు టార్గెట్‌ ధర పరిశీలిస్తే.. 
జెఫెరీస్‌: టార్గెట్‌ ధరను రూ.1,910 నుంచి రూ.1,850కి తగ్గించింది.
మోర్గాన్‌ స్టాన్లీ: ఇది టార్గెట్‌ ధరను రూ.3,465గా నిర్ణయించింది.
నొమురా: రూ.2,704 టార్గెట్‌ ధరతో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సూచించింది.  



You may be interested

మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ ఆకర్షణీయం

Monday 16th July 2018

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కో-చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఈక్విటీస్‌) మహేశ్‌ పాటిల్‌ వ్యాఖ్య ఇన్వెస్టర్లు వచ్చే మూడేళ్లలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి 12-13 శాతం మేర రాబడులను అందుకోవచ్చని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కో-చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ (ఈక్విటీస్‌) మహేశ్‌ పాటిల్‌ పేర్కొన్నారు. రిస్క్‌, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మిడ్‌క్యాప్స్‌ నుంచి కొంచెం ఎక్కువ రిటర్న్స్‌ను పొందొచ్చన్నారు. స్వల్పకాలంలో మిడ్‌క్యాప్స్‌ అండర్‌పెర్‌ఫార్మ్‌ చేయవచ్చని, అందువల్ల ఇన్వెస్టర్లు వచ్చే

బై బ్యాక్‌ రద్దు - పీసీ జ్యువెలర్‌ భారీ పతనం

Monday 16th July 2018

ముంబై:-  బై బ్యాక్‌ ప్రణాళిక రద్దు అంశం తెరపైకి రావడంతో పీసీ జ్యువెలర్‌ షేరు సోమవారం భారీగా పతనమైంది. నేటి బీఎస్‌ఈలో ట్రేడింగ్‌లో 24 శాతం నష్టపోయింది. మే నెలలో ప్రకటించిన రూ.424 కోట్ల ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రణాళికను రద్దు చేసుకుంటున్నట్లు పీసీ జ్యువెలర్‌ శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. బై బ్యాక్‌కు తమ బ్యాంకర్‌ నుంచి ఎన్‌ఓసీ పొందడంలో విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ

Most from this category