STOCKS

News


డాక్టర్‌ రెడ్డీస్‌కు యూఎస్‌ఎఫ్‌డీ షాక్‌

Wednesday 31st October 2018
Markets_main1540959794.png-21597

  • 3నెలల కనిష్టానికి పతనమైన షేరు

ప్రముఖ ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌కు చెందిన షేరు బుధవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6.50శాతం నష్టపోయింది. విశాఖపట్నంలోని దువ్వాడలోని ఉన్న ఫార్ములేషన్స్‌ తయారీ కేంద్రంలో యూఎస్‌ ఎఫ్‌డీఏ తనిఖీలు పూర్తి చేసింది. 8 రకాల ఉల్లంఘనలకు కంపెనీ పాల్పడినట్లు ఎఫ్‌డీఏ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫుడ్‌, డ్రగ్‌, కాస్మెటిక్‌ యాక్ట్‌ కింద ఫామ్‌-483ని యూఎస్‌ఎఫ్‌డీ జారీ చేసినట్టు మంగళవారం డాక్టర్‌ రెడ్డీస్‌ అధికారులు ఎక్చేంజ్‌లకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రతికూలాంశం నేపథ్యంలో నేడు షేరు 5.50శాతం నష్టంతో రూ.2450.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడే అమ్మకాలు మరింత పెరగడంతో 6.50శాతం నష్టపోయి రూ.2425.00ల కనిష్టానికి తాకింది. ఇది ఈ షేరు మూడు నెలల కనిష్టస్థాయి. ఉదయం గం.9:45ని.లకు షేరు గతముగింపు ధర(రూ.2597.7)తో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.2459.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1888.00 రూ.2687.45లుగా నమోదయ్యాయి.



You may be interested

ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా ?

Wednesday 31st October 2018

ఆర్బీఐ విధానాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వ్యవహారశైలితో  విసుగు చెందుతున్న ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్‌బీఐ గవర్నర్‌ను ముఖ్యమైన అంశాల్లో కేంద్ర ఆదేశించే అధికారాల్ని ఆర్‌బీఐ చట్టం ప్రకారం కేంద్రం సంక్రమింపచేసుకుందంటూ బుధవారం వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా చేయవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి.  ప్రభుత్వానికి, ఆర్‌బీఐ గవర్నర్‌కు

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 31st October 2018

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం పలు కంపెనీల షేర్లు ఇవే..! కోల్‌ ఇండియా:- నేటి నుంచి కంపెనీలో 3శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఒక్కో షేర్‌ను రూ.266కు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. రెండురోజుల పాటు జరిగే ఈ వాటా విక్రయంతో ప్రభుత్వానికి రూ.5,000 కోట్లు సమకూరుతాయని అంచనా. డాక్టర్‌ రెడ్డీస్‌:- యూఎస్‌ఎఫ్‌డీ దువ్వాడ మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో తనిఖీలు పూర్తి చేసింది. తనిఖీల అనంతరం 8

Most from this category