STOCKS

News


యూనిట్‌ విక్రయంతో రెడ్డీస్‌ షేరు 4% అప్‌

Monday 15th October 2018
Markets_main1539593146.png-21167

డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేరు సోమవారం దాదాపు 4 శాతంమేర పెరిగింది. కంపెనీ తనకు హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఉన్న ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌) మ్యానుఫ్యాక్చరింగ్‌ బిజినెస్‌ యూనిట్‌ను విక్రయించడం ఇందుకు ప్రధాన కారణం. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఈ ఏపీఐ యూనిట్‌ను మొత్తంగా జనరిక్స్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ థెరాపివాకు విక్రయించింది. ఈ వార్త నేపథ్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేరు ధర 4 శాతంమేర ర్యాలీ చేసింది. కాగా ఓమ్నికేర్‌ డ్రగ్స్‌ ఇండియా, లక్సాయ్‌ లైఫ్‌సైన్సెస్‌ జయింట్‌ వెంచరే థెరాపివా. 

ఏపీఐ సరఫరాలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి తాజా డీల్‌ ఉపకరిస్తుందని థెరాపివా పేర్కొంది. తయారీ కార్యకలాపాలను క్రమబద్దీకరించుకోవడానికి, వ్యయాలను తగ్గించుకోవడానికి తాజా విక్రయం దోహదపడుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ శర్మ తెలిపారు. 

కాగా మధ్యాహ్నాం 2:08 సమయంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ షేరు ధర 3.86 శాతం పెరుగుదలతో రూ.2,545 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

వచ్చే 3-4 వారాల్లో లాభాలనిచ్చే పది షేర్లివే..!

Monday 15th October 2018

ఆసియా మార్కెట్ల నుంచి అందుతున్న ప్రతికూల పవనాలతో దేశీయమార్కెట్‌ సోమవారం నష్టాల బాట పట్టింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కూడా ఇందుకు కారణమవుతోంది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి రాబడులు ఇచ్చే పది నాణ్యమైన స్టాకులను ప్రముఖ ఇన్వెస్టర్స్ రికమండ్‌ చేస్తున్నారు. వోల్టాస్‌:- టార్గెట్‌ ధర:- రూ.560, స్టాప్‌ లాస్:- రూ.480. ఈ షేరు ఇటీవల రూ.636 వద్ద కరెక‌్షన్‌కు లోనై రూ. 475 వద్ద మద్దతు

సెక్టోరల్‌ ఫండ్స్‌ వద్దు.. మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ముద్దు..

Monday 15th October 2018

సెక్టోరల్‌ ఫండ్స్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు మ్యూచువల్‌ ఫండ్‌ నిపుణులు, వ్యాల్యు రీసెర్చ్‌ సీఈవో ధీరేంద్ర కుమార్‌. రూపాయి పతనం నేపథ్యంలో ఎగుమతి ఆధారిత వ్యాపారాలపై ఎక్కువగా ఆధారపడ్డ ఐటీ, ఫార్మా రంగ స్టాక్స్‌కు డిమాండ్‌ ఏర్పడింది. చాలా మంది అడ్వైజర్లు కూడా వారి ఇన్వెస్టర్లకు ఈ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సలహా ఇస్తున్నారు. అయితే ధీరేంద్ర కుమార్‌ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఇన్వెస్టర్లు

Most from this category