STOCKS

News


డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏడీఆర్‌ డౌన్‌..

Saturday 10th November 2018
Markets_main1541824750.png-21834

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ స్టాక్స్‌ ఏడీఆర్‌లు క్షీణించాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో, వేదాంత స్టాక్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోతే, వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది.  
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.46 శాతం లాభంతో 13.11 డాలర్లకు పెరిగింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.21 శాతం క్షీణతతో 9.49 డాలర్లకు తగ్గింది. విప్రో ఏడీఆర్‌ 0.20 శాతం వృద్ధితో 5.06 డాలర్లకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.12 శాతం తగ్గుదలతో 92.05 డాలర్లకి క్షీణించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.10 శాతం వృద్ధితో 9.65 డాలర్లకి పెరిగింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 1.51 శాతం క్షీణతతో 33.29 డాలర్లకి తగ్గింది. ఇక వేదాంత ఏడీఆర్‌ 0.80 శాతం పెరుగుదలతో 11.23 డాలర్లకి ఎగసింది. 



You may be interested

ఆసియా మార్కెట్లు పతనం..

Saturday 10th November 2018

అమెరికా మార్కెట్ల నష్టాల నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచుతామని సంకేతాలివ్వడం వల్ల అంతర్జాతీయంగా మార్కెట్లు పతనమయ్యాయి. ఆసియా ప్రధాన మార్కెట్లను గమనిస్తే.. తైవాన్‌, చైనా షాంఘై, జపాన్‌ నికాయ్‌ ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పడిపోయాయి. ఇక హాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌ ఏకంగా 2 శాతానికిపైగా పతనమైంది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 15

ఆఫ్‌షోర్‌లో రూపీ దిగువకు

Saturday 10th November 2018

ఇండియన్‌ రూపాయి శుక్రవారం రాత్రి ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే దాదాపు 23 పైసలు మేర క్షీణించింది. 72.73 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో 72.91 స్థాయికి కూడా పతనమైంది. అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు గణనీయంగా తగ్గుతుండటంతో దేశీయ కరెన్సీ కూడా కనిష్ట స్థాయిల నుంచి రికవరీ అవుతూ వస్తోంది. ఇవి రెండూ దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలు. మంగళవారం ముగింపుతో పోలిస్తే శుక్రవారం

Most from this category