STOCKS

News


52వారాల గరిష్టానికి డాక్టర్‌ రెడ్డీస్‌

Monday 3rd September 2018
Markets_main1535962250.png-19915

దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ షేరు సోమవారం బీఎస్‌ఈలో 52-వారాల గరిష్టాన్ని తాకింది. నేడు డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు బీఎస్‌ఈలో రూ.2510.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి ఇంట్రాడేలో ఫార్మా షేర్ల ర్యాలీలో భాగంగా ఈ షేరు 5శాతం లాభపడి రూ.2620.00ల వద్ద 52-వారాల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు ధర(రూ.2491.35)తో పోలిస్తే 5.14శాతం లాభపడి రూ.2614.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1888.00లు రూ.2620.80లుగా నమోదయ్యాయి. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈ 5శాతం లాభపడి నిఫ్టీ-50 సూచీలో టాప్‌ గెయినర్‌గా ట్రేడ్‌ అవుతోంది.
టాప్‌ గెయినర్‌గా నిఫ్టీ ఫార్మా సూచి:-
ఒడిదుడుకుల నేటి మార్కెట్‌ ట్రేడింగ్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా, లుపిన్‌ షేర్ల అండతో ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫార్మా సూచి అత్యధికంగా 2శాతం వరకు లాభపడింది. ఈ సూచీలోని మొత్తం భాగమైన మొత్తం 10షేర్లలో 8షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 2 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(10,390.95)తో పోలిస్తే 1.60శాతం లాభపడి 10,559.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ 14రోజుల ట్రేడింగ్‌లో నిఫ్టీ ఫార్మా సూచి 15శాతం లాభపడి 11 రోజులు టాప్‌ గెయినర్‌గా నిలిచింది.



You may be interested

లాభాల స్వీకరణకు వెయిట్‌ చేయాలి...

Monday 3rd September 2018

మార్కెట్లు స్తబ్ధత లేదా అలసట సంకేతాలు ఇచ్చినప్పుడు అధిక విలువ కలిగిన విభాగాల నుంచి కొంత డబ్బుని వెనక్కు తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్లు ఇలాంటి సూచనలేమీ ఇవ్వడం లేదని, ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకోవడానికి మరి కొంత కాలం వేచి ఉండాలని సూచించారు సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జగనాథం తునుగుంట్ల. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. యస్‌ బ్యాంక్‌ ఎండీ,

మిడ్‌క్యాప్స్‌కు టైమొచ్చింది!!

Monday 3rd September 2018

దేశీ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈక్విటీల్లో వీరి వాటా మరింత పెరగడానికి అవకాశాలున్నాయి. హాంగ్‌కాంగ్‌లోని ఆసియా ఫోకస్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ సోలిట్యూడ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ జోయెల్‌ వార్నర్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఇండియన్‌ మార్కెట్‌లో ఇండెక్స్‌లు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల్లో ఉన్నప్పటీకి ఈయన ఇక్కడి మార్కెట్లలో మరిన్ని

Most from this category