STOCKS

News


డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లకు బ్రోకరేజ్‌ జెఫ్పారీస్ షాక్‌

Friday 15th February 2019
Markets_main1550211729.png-24208

డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లకు జెఫ్పారీస్ బ్రోకరేజ్‌ సం‍స్థ షాక్‌నిచ్చింది. హైదరాబాద్‌లో బూచుపల్లి యూనిట్‌ అబ్జర్వేషన్‌ అంశంపై రేటింగ్‌ సంస్థ ఆందోళన వ్యక్తం చేయడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఏకంగా 30 శాతం కుప్పకూలాయి. బూచుపల్లి యూనిట్‌లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ తనిఖీలు నిర్వహించి 11 లోపాలున్నట్లు ఫామ్‌ - 483ను జారీ చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఫిబ్రవరి 8వ తేదీన సమాచారం ఇచ్చింది. ఈ లోపాలను సరిదిద్దుకోవడానికి సమయం పట్టవచ్చనే అంచనాలతో జెఫ్పారీస్‌ రేటింగ్‌ సం‍స్థ షేరుకు అండర్‌ఫర్‌ఫామ్‌ రేటింగ్‌ కేటాయిచింది. షేరు టార్గెట్‌ ధరను రూ.2,180లకు కుదించింది. అలాగే యూఎస్‌ఎఫ్‌డీఏ యూనిట్‌లో మరోసారి తనిఖీలు నిర్వహించవచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది.  ప్రతికూలాంశంతో షేరు కౌంటర్‌లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో షేరు ఇంట్రాడేలో 30శాతం నష్టపోయి రూ.1872.95లకు పతనమైంది. అయితే క్షణాల్లో కొనుగోళ్లు జరగడంతో షేరు తిరిగి కోలుకుంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.2669.3)తో పోలిస్తే 8శాతం నష్టంతో రూ.2467.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ. 1888.00 రూ.2875.00లుగా నమోదయ్యాయి.



You may be interested

ఎకానమీపై ఉదయ్‌ కోటక్‌ ఆందోళన

Friday 15th February 2019

దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదని ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ అభిప్రాయపడ్డారు. కానీ సరైన చర్యలు తీసుకుంటే ఈ సమస్య వ్యవస్థీకృతం కాకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. కంపెనీల బాలెన్స్‌ షీట్లు బాగుపడి, వాటిపై నమ్మకం కలిగే వరకు ఇన్వెస్టర్లలో భయం పోదన్నారు. ఇప్పటివరకు స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లు విస్తృత బాధను చవిచూశాయని చెప్పారు. ఇకపై వీటి కష్టాలు కాస్త గట్టెక్కుతాయని అంచనా వేశారు. చిన్న షేర్లకు ఇబ్బందులున్నా

ఈ నెలాఖరు వరకు ఇంతే!

Friday 15th February 2019

మార్కెట్‌పై ఎస్‌బీఐ క్యాప్‌ అంచనా కొద్దికాలంగా స్వల్పరేంజ్‌లో కదలాడుతున్న సూచీలు ఈ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగవచ్చని ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి మహంతేష్‌ సబారడ్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు పెద్దగా కదలికలు చూపకున్నా, ఈ నెల్లో ఎఫ్‌ఐఐల ప్రవాహం మాత్రం బలంగా ఉందన్నారు. కానీ సూచీలు మాత్రం ఎంత పాజిటివ్‌ వార్తలు వినిపిస్తున్నా ఏమాత్రం చలించడంలేదని, ఇదే ధోరణి ఇంకో రెండు వారాలపాటు కొనసాగవచ్చని చెప్పారు. వచ్చే నెలారంభంలో రెండు అంశాలు

Most from this category