STOCKS

News


మిశ్రమంగా అమెరికా మార్కెట్‌

Saturday 20th October 2018
Markets_main1540018861.png-21316

అమెరికా మార్కెట్‌ శుక్రవారం దాదాపుగా నష్టాల్లోనే ముగిసింది. ఇండెక్స్‌లు ప్రారంభ లాభాలను చివరి వరకు నిలుపుకోలేకపోయాయి. డౌజోన్స్‌ లాభాల్లో ముగిస్తే.. మిగతా రెండు ప్రధాన ఇండెక్స్‌లు నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.3 శాతం లేదా 65 పాయిం‍ట్ల లాభంతో 25,444 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ షేరు 8.8 శాతం పెరగడం సానుకూల ప్రభావం చూపింది. 2008 అక్టోబర్‌ 28 నుంచి చూస్తే ఈ స్టాక్‌ ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. కంపెనీ ఎర్నింగ్స్‌ అంచనాలు మించి ఉండటం ఈ పెరుగుదలకు కారణం. ఎస్‌అండ్‌పీ 500.. 0.04 శాతం లేదా 1 పాయింటు నష్టంతో 2,767 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.48 శాతం లేదా 36 పాయింట్ల నష్టంతో 7,449 పాయింట్ల వద్ద ముగిసింది. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ షేర్లు తగ్గుదల ప్రతికూల ప్రభావం చూపింది. వారం మొత్తంగా చూస్తే డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.4 శాతం పెరిగింది. ఈ ఇండెక్స్‌ గత మూడు వారాలుగా పడుతూనే వచ్చింది. ఇక నాస్‌డాక్‌ 0.6 శాతం నష్టపోయింది. 


Dow

You may be interested

చైనా మార్కెట్‌ బౌన్స్‌బ్యాక్‌..

Saturday 20th October 2018

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన చైనా మార్కెట్ చివరకు లాభాల్లో ముగిసింది. 2.58 శాతం లేదా 64 పాయింట్ల పెరుగుదలతో 2,550 పాయింట్లకు బౌన్స్‌బ్యాక్‌ అయ్యింది. చైనా ఆర్థిక వృద్ధి తొమిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని గణాంకాలు పేర్కొనడంతో మార్కెట్లు పడిపోయాయి. అయితే చైనా టాప్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్లు.. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై, స్టాక్‌ మార్కెట్‌పై విశ్వాసంతో ఉన్నామని పేర్కొనడం సానుకూల ప్రభావం చూపింది. కాగా చైనా స్టాక్‌

సెకండ్స్‌ హోమ్‌!

Saturday 20th October 2018

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కొత్త గృహాలకు డిమాండ్‌ ఎంత ఉందో రీసేల్‌ లేక సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లకూ అంతే ఉంది. కొత్త ఇల్లు నేరుగా డెవలపర్‌ నుంచి కొనుగోలు చేస్తే.. రీసేల్‌ ప్రాపర్టీలను పాత యజమాని నుంచి కొనుగోలు చేస్తాం. కొత్త లేక పాత ప్రాపర్టీ ఏదైనా కానీ ఎంపికలో ప్రధానమైంది బడ్జెట్‌. దీంతో పాటూ మన జీవన శైలి, అవసరాలు, అభిరుచులు, ఇంటీరియర్, ఇంధన సామర్థ్యాలు వంటివి కూడా

Most from this category