STOCKS

News


వారంలో 4.4 శాతం పతనమైన డోజోన్స్‌

Saturday 24th November 2018
Markets_main1543034843.png-22356

శుక్రవారం అమెరికా స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ 179 పాయింట్లు (0.73 శాతం) నష్టపోయి 24,285 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ 33 పాయింట్లు (0.48 శాతం) కోల్పోయి 6,939 వద్ద స్థిరపడింది. ఎస్‌ అండ్‌ పీ 17 పాయింట్లు (0.66 శాతం) నష్టపోయి 2,632 దగ్గర ముగిసింది. వారం మొత్తం మీద డోజోన్స్‌ ఏంకగా  1,127 పాయింట్లు (4.4 శాతం) నష్టపోయింది. ఈఏడాది జూలై తరువాత అత్యధిక భారీ పతనాన్ని నమోదుచేసింది. గడిచిన వారంరోజుల ట్రేడింగ్‌లో నాస్‌డాక్‌ 308 పాయింట్లు (4.3 శాతం), ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌ 104 పాయింట్లు (3.8 శాతం) నష్టపోయాయి. ముడిచమురు ధరలు తగ్గిపోవడంతో ఈ రంగ షేర్లు భారీగా పతనంకావడం, ఎకనామిక్‌ అవుట్‌లుక్‌పై నెలకొన్న ఆందోళన, వచ్చేవారంలో జరగనున్న జీ20 సమావేశంలో అమెరికా-చైనాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన చర్యలు ఉండడం వంటి కీలక అంశాల నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. 


 



You may be interested

ఈనెల 28 నుంచి సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ప్రారంభం

Saturday 24th November 2018

ముంబై: నాలుగో విడత సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (సీపీఎస్ఈ ఈటీఎఫ్) ఈనెల 28 (వచ్చే బుధవారం) నుంచి తమ ఎక్స్ఛేంజీలో ప్రారంభంకానుందని బొంబే స్టాక్స్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రకటించింది. ఇంటర్‌నెట్ ఆధారిత బుక్‌ బిల్డింగ్‌ వ్యవస్థ (ఐబీబీఎస్‌) ప్లాట్‌ఫాం ద్వారా సీపీఎస్ఈ ఈటీఎఫ్ ఎఫ్‌ఎఫ్‌ఓ-3 సబ్‌స్రిప్షన్‌ ప్రారంభమవుతుందని, ఇదే నెల 30న (శుక్రవారం) ముగియనుందని వెల్లడించింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీలో నమోదైన ట్రేడింగ్‌ మెంబర్లకు

మ్యూచువల్‌ ఫండ్స్‌ నచ్చింది వీటినే

Saturday 24th November 2018

దేశీయ మార్కెట్లలో కరెక్షన్‌ను మ్యూచువల్‌ ఫండ్స్‌ ఓ మంచి అవకాశంగా తీసుకున్నాయి. తక్కువ ధరల వద్ద అందుబాటులో ఉన్న బలమైన కంపెనీల షేర్లను అక్టోబర్‌లో కొనుగోలు చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ, రిలయన్స్‌ నిప్పన్‌ ఏఎంసీలు కలసి కోల్‌ ఇండియాలో 7.67 కోట్ల షేర్లను కొనుగోలు చేశాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కోల్‌ ఇండియా నికర లాభం ఎనిమిది రెట్లు పెరిగి రూ.3,085 కోట్లకు చేరిన విషయం విదితమే.

Most from this category