STOCKS

News


నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 3rd November 2018
Markets_main1541220224.png-21675

  • 6.6 శాతం పతనమైన ఆపిల్‌ షేరు

న్యూయార్క్: అమెరికా స్టాక్‌ మార్కెట్ల మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. శుక్రవారం యూఎస్‌ సూచీలు అర శాతం మేర నష్టాలను నమోదుచేశాయి. ఆపిల్ ఇంక్ షేరు ధర 6.6 శాతం పతనం కావడమే ఇందుకు ప్రధాన కారణం కాగా, చైనా వాణిజ్య అంశంపై నెలకొన్న అనిశ్చితి సూచీలను నష్టాల బాట పట్టించింది. డోజోన్స్‌ 0.43 శాతం నష్టపోగా.. నాస్‌డాక్‌ 1.04 శాతం, ఎస్‌ అండ్‌ పీ 0.63 శాతం నష్టాల్లో ముగిశాయి. అమెరికా వైట్‌ హౌస్‌ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో వెల్లడించిన అంశం మార్కెట్‌ను ప్రభావితం చేసిందని వాల్‌స్ట్రీట్‌ వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే అర్జెంటీనాలో జరగనున్న జీ-20 సమావేశం ద్వారా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. ట్రేడ్‌ ప్లాన్‌ విషయంపై ఎటువంటి ప్రణాళికా యూఎస్‌ అధికారులను అడగలేదని లారీ కుడ్లో వ్యాఖ్యానించారు. 

- ఒక ట్రిలియన్‌ మార్కెట్‌ విలువను కోల్పోయిన ఆపిల్‌
శుక్రవారం ట్రేడింగ్‌లో ఆపిల్ ఇంక్ ఒక ట్రిలియన్‌ మార్కెట్‌ క్యాపిటల్‌ మార్కును కోల్పోయింది. అమెరికాలో ఐఫోన్‌ అమ్మకాలకు డిసెంబర్‌ సీజన్‌ కాగా, ఈసారి సేల్స్‌ అంచనాలకు అందుకోలేకపోవచ్చని కంపెనీ వెల్లడించింది. దీంతో షేరు ధర 6.6 శాతం పతనమైంది.



You may be interested

ఇన్ఫో ఎడ్జ్‌ టార్గెట్‌ రూ.1,628

Saturday 3rd November 2018

కంపెనీ: ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా) లిమిటెడ్‌ సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ధర: రూ.1,467 (నవంబర్‌ 3, 2018న) టార్గెట్‌ ధర: రూ.1,628 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.1,697 /1,126 ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా) లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సెంట్రమ్‌ వెల్లడించింది. సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌

74 కంపెనీల్లో పెరిగిన ప్రమోటర్ల వాటా

Saturday 3rd November 2018

మార్కెట్లు భారీగా పతనం కావడం, కొన్ని స్టాక్స్‌ అయితే, కకావికలం కావడం ఇన్వెస్టర్లు గడిచిన రెండు నెలల కాలంలో చూసి ఉంటారు. కానీ, ప్రమోటర్లు మాత్రం దీన్ని ఓ అవకాశంగా తీసుకుని సెప్టెంబర్‌ త్రైమాసికంలో తమ కంపెనీల్లో స్వల్పంగా వాటాలు పెంచుకున్నారు. బీఎస్‌ఈ 500 సూచీలోని కంపెనీల్లో 74 కంపెనీల్లో ప్రమోటర్ల వాటా పెరిగినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. 2018లో ఇప్పటి వరకు ఈ కంపెనీల షేర్ల ధరలు 80

Most from this category