STOCKS

News


అమెరికా మార్కెట్‌ డౌన్‌

Thursday 18th October 2018
Markets_main1539839524.png-21267

కంపెనీలు ఎర్నింగ్స్‌ అదిరిపోవడంతో మంగళవారం 2 శాతానికిపైగా పెరిగిన అమెరికా స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు బుధవారం రోజు అదే జోరును కొనసాగించలేకపోయాయి. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వు సెప్టెంబర్‌ సమావేశపు మినిట్స్‌.. రానున్న రోజుల్ల ఎక్కువ సార్లు వడ్డీ రేట్ల పెంపుకు సాంకేతాలివ్వడం ప్రతికూల ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థ స్థిర వృద్ధిక కఠిన ద్రవ్య విధానాలు అనుసరిస్తామని ఫెడ్‌ పేర్కొంది. అలాగే ఐబీఎం ఎర్నింగ్స్‌ అంచనాల కన్నా తక్కువగా ఉండటం నెగటివ్‌ ప్రభావం చూపింది. దీంతో ప్రధాన ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.36 శాతం లేదా 92 పాయిం‍ట్ల నష్టంతో 25,707 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.03 శాతం లేదా 1 పాయింటు నష్టంతో 2,809 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 0.04 శాతం లేదా 3 పాయింట్ల నష్టంతో 7,642 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండెక్స్‌లు ఒకానొక సమయంలో 1 శాతానికిపైగా పడిపోయాయి. అయితే చివరకు రికవరీ అయ్యాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణ భయాలు తక్కువగానే ఉన్నాయని, అయితే ద్రవ్యోల్బణం రానున్న కాలంలో అంచనాల కన్నా ఎక్కువగా పెరిగితే అప్పుడు వడ్డీ రేట్ల 3 శాతానికిపైగా చేరొచ్చని మోర్గాన్‌ స్టాన్లీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జిమ్‌ కారోన్‌ తెలిపారు.



You may be interested

ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 4% పతనం..

Thursday 18th October 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ బుధవారం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోయింది. ఎక్కవ వ్యాల్యుమ్స్‌తో దాదాపు టాటా మోటార్స్‌ స్థాయిలోనే ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ కూడా పతనమైంది.    టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 4.66 శాతం క్షీణతతో 12.06

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Thursday 18th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 10:00 గంటల సమయంలో 86 పాయింట్ల నష్టంతో 10,374 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,443 పాయింట్లతో పోలిస్తే 69 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ రోజంతా ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే..  నిప్టీ శుక్రవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు

Most from this category