STOCKS

News


అమెరికా మార్కెట్ల ఎన్నికల ర్యాలీ సమాప్తం..

Saturday 10th November 2018
Markets_main1541824944.png-21836

  • ప్రధాన ఇండెక్స్‌లు దాదాపు 1 శాతం డౌన్‌

అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఇండెక్స్‌లు దాదాపు 1 శాతంమేర క్షీణించాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 0.77 శాతం లేదా 202 పాయిం‍ట్ల నష్టంతో 25,989 పాయింట్ల వద్ద ముగిసింది. డౌజోన్స్‌ ఒకానొక సమయంలో 300 పాయింట్లకుపైగా పడిపోయింది. చివరకు కొంత కోలుకుంది. క్యాటర్‌పిల్లర్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.92 శాతం లేదా 26 పాయింట్ల నష్టంతో 2,781 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కన్సూమర్‌ డిస్క్రీషనరీ, టెక్నాలజీ స్టాక్స్‌ నష్టపోవడం ఇందుకు కారణం. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ ఏకంగా 1.65 శాతం లేదా 124 పాయింట్ల నష్టంతో 7,406 పాయింట్ల వద్ద ముగిసింది. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, అల్ఫాబెట్‌ వంటి స్టాక్స్‌ నష్టపోవడం ఇందుకు కారణం. క్రూడ్‌ ధరలు మరింత తగ్గడం ప్రతికూల ప్రభావం చూపింది. క్రూడ్‌ ధరల తగ్గుదల నేపథ్యంలో గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళనలు మొదలయ్యాయి. వెస్ట్‌టెక్సాస్‌ ఇంటర్‌మీడియట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 60.19 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఒకానొక సమయంలో 60 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అయితే మళ్లీ కోలుకుంది. 52 వారాల గరిష్ట స్థాయి నుంచి చూస్తే ధరలు 20 శాతానికిపైగా పడిపోయాయి. చైనా వాహన విక్రయాల గణాంకాలు నిరుత్సాహపరచడం కూడా వాల్‌స్ట్రీట్‌ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. అలాగే ఫెడరల్‌ రిజర్వు.. వడ్డీ రేట్లు పెంచుతామని సంకేతాలివ్వడం కూడా నెగటివ్‌ ప్రభావం చూపింది. అయితే వారంగా చూస్తే.. ఇండెక్స్‌లు లాభాల్లోనే ఉన్నాయి. ఎస్‌అండ్‌పీ 500.. 2.8 శాతం, డౌజోన్స్‌ 2.1 శాతం పెరిగాయి. ఇక నాస్‌డాక్‌ 0.7 శాతం ఎగసింది.  



You may be interested

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Saturday 10th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాలతోనే ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంతో 10,572 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం నాటి ముగింపు స్థాయి 10,623 పాయింట్లతో పోలిస్తే 51 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే.. అప్పుడు నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు

ఆసియా మార్కెట్లు పతనం..

Saturday 10th November 2018

అమెరికా మార్కెట్ల నష్టాల నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచుతామని సంకేతాలివ్వడం వల్ల అంతర్జాతీయంగా మార్కెట్లు పతనమయ్యాయి. ఆసియా ప్రధాన మార్కెట్లను గమనిస్తే.. తైవాన్‌, చైనా షాంఘై, జపాన్‌ నికాయ్‌ ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పడిపోయాయి. ఇక హాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌ ఏకంగా 2 శాతానికిపైగా పతనమైంది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 15

Most from this category