STOCKS

News


డౌజోన్స్‌ 1,655 పాయింట్లు పతనం

Saturday 22nd December 2018
Markets_main1545460897.png-23166

  • వారంలో ఈ స్థాయిలో పడిపోవడం పదేళ్లలో ఇదే తొలిసారి
  • గరిష్ట స్థాయి నుంచి నాస్‌డాక్‌ 22 శాతం క్రాష్‌; 
  • ఎస్‌అండ్‌పీ 18 శాతం క్షీణత

అమెరికా మార్కెట్లు శుక్రవారం మళ్లీ పతనమయ్యాయి. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ దాదాపు 3 శాతం.. డౌజోన్స్‌ ఇండెక్స్‌ దాదాపు 2 శాతం, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 2 శాతానికి పైగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 1.81 శాతం లేదా 414 పాయిం‍ట్ల నష్టంతో 22,445 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 2.06 శాతం లేదా 51 పాయింట్ల నష్టంతో 2,416 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.99 శాతం లేదా 195 పాయింట్ల నష్టంతో 6,333 పాయింట్ల వద్ద ముగిసింది. యూరోజోన్‌లోని అస్థిర పరిస్థితులు, చైనా మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచ వృద్ధి నెమ్మదించడం, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు, అమెరికాలో కార్పొరేట్‌ ప్రాఫిట్స్‌ తగ్గడం, అమెరికా ప్రభుత్వ షాట్‌డౌన్‌ భయాలు వంటి పలు అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. 
ఇండెక్స్‌ల పనితీరు గమనిస్తే..
♦ డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ ఈ వారంలో 6.8 శాతం లేదా 1,655 పాయింట్ల మేర పతనమైంది. 2008 అక్టోబర్‌ నుంచి చూస్తే ఇండెక్స్‌ వారంలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. 
♦ వారంగా చూస్తే నాస్‌డాక్‌ 8.3 శాతం మేర పడిపోయింది. ఈ ఏడాది ఆగస్ట్‌లోని గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఇండెక్స్‌ 22 శాతం పతనమైంది. ఇది బేర్‌ మార్కెట్‌ను సూచిస్తోంది. 
♦ ఎస్‌అండ్‌పీ 500 ఈ వారంలో 7 శాతం మేర క్షీణించింది. ఇండెక్స్‌ తన గరిష్ట స్థాయి నుంచి చూస్తే 18 శాతం పడిపోయింది. 
♦ డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు డిసెంబర్‌ నెలలో ఈ స్థాయిలో పడిపోవడం 1931 నాటి మహామాంద్యం తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు ఇండెక్స్‌లు 12 శాతం మేర పతనమాయ్యయి. 
♦ డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు 2018లో ఎలాంటి లాభాలు అర్జించకపోగా 9 శాతం పడిపోయాయి. 



You may be interested

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు ..

Saturday 22nd December 2018

జపాన్‌ మార్కెట్‌ 220 పాయింట్లు డౌన్‌ హాంగ్‌ సెంగ్‌ 130 పాయింట్లు అప్‌ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ప్రారంభంలో సూచీలన్నీ నష్టాల్లో ట్రేడయ్యాయి. అయితే చివరకు వచ్చేసరికి హాంగ్‌ సెంగ్‌, కొస్పి ఇండెక్స్‌లు లాభాల్లోకి వచ్చేశాయి. ఇక మిగతావన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 5 పాయింట్ల నష్టంతో 3,046 పాయింట్ల వద్ద ముగిసింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 28 పాయింట్ల నష్టంతో

సోమవారం నిఫ్టీ ఓపెనింగ్‌ ఎలా ఉండొచ్చు?

Saturday 22nd December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాల్లో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 5 పాయింట్ల నష్టంతో 10,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,767 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు

Most from this category