STOCKS

News


వాల్‌ స్ట్రీట్‌ క్రాష్‌

Saturday 15th December 2018
Markets_main1544857356.png-22964

అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. ఇండెక్స్‌లు 2 శాతం మేర పడిపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.02 శాతం లేదా 497 పాయిం‍ట్ల నష్టంతో 24,100 పాయింట్ల వద్ద ముగిసింది. మే నెల నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. యాపిల్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ షేర్లు నష్టపోవడం ఇండెక్స్‌ను కుంగదీసింది. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే డౌజోన్స్‌ లాభాలన్నీ అవిరయ్యి.. 2.5 శాతం మేర నష్టపోయింది. ఎస్‌అండ్‌పీ 500.. 1.91 శాతం లేదా 51 పాయింట్ల నష్టంతో 2,600 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఏప్రిల్‌ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ షేర్లు పడిపోవడంతో ఇండెక్స్‌ నష్టపోవాల్సి వచ్చింది. ఎస్‌అండ్‌పీ కూడా ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే 2.75 శాతం మేర నష్టపోయింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 2.26 శాతం లేదా 160 పాయింట్ల నష్టంతో 6,910 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే ఈ ఇండెక్స్‌ 0.11 శాతం లాభంతో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మందగమనంపై నెలకొన్న ఆందోళనలను యూరప్‌ మరింత పెంచడం, చైనా ఆర్థిక గణాంకాలు అంచనాల కన్నా బలహీనంగా ఉండటం వంటి అంశాలు మార్కెట్లపై త్రీవ ప్రతికూల ప్రభావం చూపాయి. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ ఇండెక్స్‌లు వాటి 52 వారాల గరిష్ట స్థాయి నుంచి చూస్తే 10 శాతం మేర పతనమయ్యాయి. 2016 మార్చి నుంచి చూస్తే ఇండెక్స్‌లు ఇలా ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.  



You may be interested

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 15th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి ఫ్లాట్‌గా ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.50 పాయింటు లాభంతో 10,831 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,820 పాయింట్లతో పోలిస్తే 11 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు

చైనా ఎఫెక్ట్: ఆసియా డల్‌..

Saturday 15th December 2018

చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ విక్రయాల గణాంకాలు నిరుత్సాహానికి గురిచేయడంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాలతోనే ముగిశాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 34 పాయింట్ల నష్టంతో 3,077 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 85 పాయింట్ల నష్టంతో 9,774 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 40 పాయింట్ల నష్టంతో 2,593 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌

Most from this category