STOCKS

News


లాభాల్లో ఆసియా మార్కెట్లు... మిశ్రమంగా యూరప్‌ మార్కెట్లు

Thursday 21st March 2019
Markets_main1553156327.png-24726

ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్లపై యథాతధ పాలసీ ప్రకటన నేపథ్యంలో గురువారం ఆసియాలో హాంకాంగ్‌ మినహా మిగిలిన మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, అమెరికా - చైనా వాణిజ్య చర్చలు మార్కెట్ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి. అలాగే ప్రపంచమార్కెట్లో 4నెలల గరిష్టస్థాయి స్థాయిల నుంచి ముడిచమురుధరలు దిగిరావడం, డాలర్‌ ఇండెక్స్‌ పతనం తదితర అంశాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. అన్ని మార్కెట్లు అరశాతం లాభపడ్డా‍యి. అత్యధికంగా తైవాన్‌ ఇండెక్స్‌ 0.75శాతం లాభపడింది. సింగపూర్‌ కాంపోషైట్‌, షాంఘై కాంపోజిట్‌ సూచీలు అరశాతం పెరిగాయి. కోప్సీ, స్ట్రైట్స్‌ టైమ్స్‌ సూచీలు 0.10శాతం వరకు లాభపడ్డాయి. అయితే జపాన్‌లో నేడు ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈ దేశ మార్కెట్‌ పనిచేయడం లేదు. హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ మాత్రం 0.80శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతుంది.

మిశ్రమంగా ఐరోపా మార్కెట్లు:-
యూరోజోన్‌లోని ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, వాణిజ్య యుద్ధ చర్చలు నేపథ్యంలో బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. అయితే డాలర్‌ పతనంతో మైనింగ్‌ షేర్లు లాభాల్ని ఆర్జిస్తున్నాయి. బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్ఈ అరశాతం లాభపడి 7,321.04 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.10శాతం నష్టపోయి 5,380.88 వద్ద, జర్మన్‌ డీఏఎక్స్‌ ఇండెక్స్‌ అరశాతం క్షీణించి 11,561.44 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

జెట్‌కు బ్యాంకుల బాసట

Thursday 21st March 2019

- సంస్థను నిలబెట్టేందుకు ప్రణాళికలు - మేనేజ్‌మెంట్ మార్పు యోచన - ఆర్థిక మంత్రి జైట్లీతో ఎస్‌బీఐ చీఫ్ కుమార్‌ భేటీ న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ విమానయాన దిగ్గజం జెట్ ఎయిర్‌వేస్‌ కుప్పకూలకుండా చూసేందుకు బ్యాంకర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మేనేజ్‌మెంట్ మార్పు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్‌, పౌర

ఓఎంసీలపై సీఎల్‌ఎస్‌ఏ అప్రమత్తత!

Thursday 21st March 2019

చమురు మార్కెటింగ్‌ కంపెనీల(హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌) షేర్లపై అప్రమత్తంగా ఉన్నట్లు ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. ఈ షేర్లన్నీ గత నెల రోజుల్లో దాదాపు 30 శాతం వరకు ర్యాలీ జరిపాయి. ఈ నేపథ్యంలో వీటిపై ఇచ్చిన ‘అమ్మొచ్చు’ కాల్‌ను కొనసాగిస్తున్నట్లు సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ప్రపంచంలోనే ఇవి వాల్యూషన్లు అత్యధికంగా ఉన్న రిఫైనరీ కంపెనీల షేర్లని తెలిపింది. క్రూడాయిల్‌ ధరలో క్రమానుగత పెరుగుదల ఈ కంపెనీలపై నెగిటివ్‌ ప్రభావం

Most from this category