News


భారత మార్కెట్‌కు ‘డబుల్‌ ఓవర్‌వెయిట్‌’..!

Saturday 17th November 2018
Markets_main1542438584.png-22141

  • దేశీ మార్కెట్‌ పట్ల ‘డబుల్‌ ఓవర్‌వెయిట్‌’ వైఖరితో ఉన్నట్లు సీఎల్‌ఎస్‌ఏ మేనేజింగ్ డైరెక్టర్, ఈక్విటీ వ్యూహకర్త క్రిస్టోఫర్‌ ఉడ్ తన వీక్లీ న్యూస్ ‌లెటర్ 'గ్రీడ్ అండ్ ఫియర్'లో పేర్కొన్నారు.

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్ పట్ల తాను పాజిటివ్‌గా ఉన్నట్లు క్రిస్టోఫర్‌ ఉడ్ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్ రిలేటీవ్‌ రిటర్న్‌ పోర్టిఫోలియోలో భారత్‌ పట్ల ‘డబుల్‌ ఓవర్‌వెయిట్‌’ వైఖరితో ఉన్నట్లు తెలిపారు. సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ఎన్నికైతే.. పెట్టుబడులు మళ్లీ ఊపందుకుంటాయన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు త్వరలోనే ఫలాలను అందించనున్నాయని విశ్లేషించారు. మోడీ సర్కార్‌ తమ మొదటి ఐదేళ్ల హయంలో అమలుచేసిన వస్తు, సేవల పన్ను చట్టం వంటి నిర్మాణాత్మక సంస్కరణల సానుకూల ఫలితాలు.. తరువాత ఐదేళ్ల పాలనలో స్పష్టంగా కనిపించనున్నాయని భావించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలోని నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరిస్తామని 2014లోనే మోడీ ప్రజలముందు ప్రకటించకపోవడం అనేది ఆయన అతిపెద్ద విఫలంగా తెలిపారు. బ్యాంక్రప్టీ చట్టం ద్వారా ఈ సమస్య దూరం కానుందన్న ఆయన.. ముడిచమురు ధరలు పెరగడం, డాలరు విలువ బలపడడం వంటి ప్రతికూల అంశాలు భారత మార్కెట్‌కు రిస్క్‌గా ఉన్నట్లు విశ్లేషించారు.



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీలు/బ్యాంక్స్‌ ఔట్‌లుక్‌ ఎలా ఉండొచ్చు?

Saturday 17th November 2018

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ఔట్‌లుక్‌ చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తోందని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన చూస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంకులు స్వల్ప లాభాలను నమోదు చేశాయని పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్లకు, ఎన్‌పీఏలకు అధిక కేటాయింపులు ఇందుకు కారణమని తెలిపింది. స్లిపేజ్‌లు తగ్గడం సానుకూల అంశమని పేర్కొంది. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో బ్యాంకులు పనితీరు మరింత మెరుగుపడొచ్చని అంచనా వేసింది. కార్పొరేట్‌

టాటా గ్రూప్‌ నుంచి బైబ్యాక్‌ ఆఫర్‌

Saturday 17th November 2018

బైబ్యాక్‌ విలువ రూ.450 కోట్లు టాటా గ్రూప్‌ నుంచి మరో కంపెనీ బైబ్యాక్‌ ఆఫర్‌ సిద్దమైంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో సేవలు అందించే టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ బైబ్యాక్‌ ఆఫర్‌కు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు  శుక్రవారం కంపెనీ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది. బైబ్యాక్‌ ఆఫర్‌ విలువ సుమారు రూ.450 కోట్లు ఉంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి 8.17శాతానికి సమానమైన 45లక్షల ఈక్విటీ షేర్లను

Most from this category