News


వచ్చే ఏడాదిలోపు మార్కెట్‌లో రెట్టింపు రాబడి..!

Friday 23rd November 2018
Markets_main1542948433.png-22330

ముంబై: విదేశీ నిధులు తరలివెళ్తునప్పటికీ.. దేశీ నిధులు మార్కెట్‌ను ఆదుకుంటున్నాయని, ప్రత్యేకించి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌)ల ద్వారా మార్కెట్‌లోనికి ప్రవేశించే నిధులు గతరెండేళ్లుగా జోరుమీద కొనసాగున్నాయన్నారు టౌరస్‌ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ విభాగం మేనేజర్‌ ప్రసన్న ప్రతీక్‌. ఈ ట్రెండ్‌ మరి కొంతకాలం కొనసాగేందుకు అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇన్వెస్టర్లకు సిప్‌లపై నమ్మకం పెరగడం, మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో నిబంధనలు సంతృప్తికరంగా ఉండడం, సామాన్యులలో సిప్‌లపై అవగాహన పెరుగుతుండడం, ప్రామాణీకరణ వంటి సానుకూల అంశాల నేపథ్యంలో తాము ఈ అంచనాను వెల్లడిస్తున్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఇదే సమయంలో మంచి ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గాలు కూడా లేకపోవడం అనేది మార్కెట్‌కు మరో పాజిటీవ్‌ అంశంగా ఉందన్నారు. వచ్చే కొద్ది నెలలపాటు ముడిచమురు ధరలు 60-70 డాలర్ల స్థాయిలోనే ఉండేందుకు అవకాశం ఉందని అంచనావేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతుండడం, అమెరికా నుంచి సప్లై గణనీయంగా పెరగడం వంటి అంశాల ఆధారంగా కొంతవరకు ఈ స్థాయిలో ఉండవచ్చన్నారు. వచ్చే ఏడాదికాలంలో దేశీయ, అంతర్జాతీయంగా అనేక కీలక సంఘటనలు ఉండగా.. ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని వచ్చే ఏడాదిలోపు మార్కెట్‌లో రెట్టింపు రాబడిని ఇచ్చేందుకు అవకాశం ఉందని, అయితే ఒడిదుడుకులు మాత్రం తప్పవని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రాల ఎన్నికల అంశం మార్కెట్‌కు తాత్కాలికమైనదే కాగా, ఆ తరువాత.. నిర్మాణాత్మక వృద్ధి, సంస్కరణల అజెండా, అంతర్జాతీయ ద్రవ్య లభ్యత, సెంటిమెంట్‌ వంటివి కీలకం కానున్నాయన్నారు. ఇదే సమయంలో అమెరికా వడ్డీ రేట్లు, భూగోళ రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధం వంటివి మార్కెట్‌ దిశను నిర్ణయించనున్నాయని పేర్కొన్నారు.You may be interested

పోటీతో టెల్కోల ఆదాయం అస్థిరం

Friday 23rd November 2018

ముంబై: తీవ్రమైన పోటీ కారణంగా టెలికం మార్కెట్‌ అస్థిరంగా మారిందని, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన డిజిటల్‌ ఇండియాకు ఇది హానికరమని దేశంలో అత్యధిక కస్టమర్లున్న వొడాఫోన్‌ ఐడియా సంస్థ సీఈవో బాలేష్‌ శర్మ పేర్కొన్నారు. వొడాఫోన్‌, ఐడియాల విలీనం తర్వాత తొలిసారిగా బాలేష్‌ శర్మ మీడియాతో మాట్లాడారు. వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియోలను పరోక్షంగా ప్రస్తావిస్తూ... ‘‘ముగ్గురు ఆపరేటర్లూ నష్టాలనే ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని పెట్టుబడులు పెడతారని

మార్కెట్లోకి రెడ్‌మి నోట్‌ 6 ప్రో

Friday 23rd November 2018

న్యూఢిల్లీ: చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ షావోమీ తాజాగా భారత మార్కెట్లో రెడ్‌మి నోట్‌ 6 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 4జీబీ ర్యామ్‌, 64జీబీ మెమరీ ఉండే ఫోన్ ధర రూ.13,999 కాగా, 6జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంటుంది. నవంబర్‌ 23న (శుక్రవారం) మి.డాట్‌కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌, మి హోమ్ స్టోర్స్‌లో బ్లాక్‌ ఫ్రైడే సేల్ సందర్భంగా రూ.1,000 డిస్కౌంట్‌పై ఇవి లభిస్తాయి. ముందు

Most from this category