News


ఈ పతనం చాలదు!

Friday 19th October 2018
Markets_main1539943585.png-21293

దేశీ సూచీలపై సీఎల్‌ఎస్‌ఏ
కొద్దికాలంగా భారత సూచీల్లో కొనసాగుతున్న కరెక‌్షన్‌ సరిపోదని, మార్కెట్లు మరికొంత పతనం చూడాల్సిఉందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. నిఫ్టీ గత ఒకటిరెండు నెలల్లో 11170 పాయింట్ల నుంచి 10170 పాయింట్ల వరకు పతనమైన సంగతి తెలిసిందే. శుక్రవారం సైతం సూచీలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ మరోమారు 150 పాయింట్ల నష్టంతో 10300 పాయింట్లకు చేరింది. ఈ డౌన్‌ ట్రెండ్‌ ఇప్పుడు ఆగదని సీఎల్‌ఎస్‌ఏ భారత్‌ వ్యూహకర్త మహేశ్‌ నంద్రూకర్‌ అంచనా వేశారు. సూచీలు చాలినంత కరెక‌్షన్‌ చూశాయని తాము భావించడం లేదన్నారు. వాల్యూషన్ల పరంగా సూచీలు మరింత దిగిరావాల్సిఉందన్నారు.

ప్రస్తుత పతనంలో ఫైనాన్షియల్స్‌ భారీగా పతనం కావడం సహజమేనన్నారు. గత పదిపదిహేనేళ్ల చరిత్ర చూస్తే అంతర్జాతీయంగా, దేశీయంగా ఎక్కడైనా మార్కెట్లు భారీగా పతనమైనప్పుడు ముందుగా నేలచూపులు చూసేది ఫైనాన్షియల్‌ రంగాల షేర్లేనని వివరించారు. అందువల్ల ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఫైనాన్షియల్స్‌తో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలపై అప్రమత్తంగా ఉండాలని, మరికొంతకాలం ఈ రంగంలో ఆటుపోట్లు తప్పవని చెప్పారు. అత్యంత జాగ్రత్తతో ఎంపిక చేసిన ఎన్‌బీఎఫ్‌సీలను పరిశీలించవచ్చని సూచించారు. 



You may be interested

సెన్సెక్స్‌ 464 పాయింట్లు డౌన్‌

Friday 19th October 2018

లిక్విడిటీ భయాలు మళ్లీ తలెత్తడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. దసరా  (గురువారం) సెలవు కారణంగా ఒక్క రోజు విరామం తర్వాత ఆరంభమైన స్టాక్‌ సూచీలు చెరో ఒక శాతానికి పైగా క్షీణించాయి. ఫెడ్‌ రేట్ల పెంపు భయాలు, చైనా వృద్ధి మందగించడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. దీనికి తోడు  వీసా నిబంధనలు మరింత కఠినతరం కానుండటం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌  ఇండెక్స్‌

రెండేళ్లు వేచిచూడగలరా!

Friday 19th October 2018

నాలుగు సిఫార్సులు చేస్తున్న ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ దీర్ఘకాలిక దృక్పధంతో కనీసం రెండేళ్లు వేచిచూసే ఓపిక ఉన్న ఇన్వెస్టర్ల కోసం ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ నాలుగు మేలైన షేర్లను సిఫార్సు చేస్తోంది.. 1. అశోక్‌ లేలాండ్‌: ఇటీవల కాలంలో నెగిటివ్‌ వార్తలతో షేరు భారీ పతనాన్ని చూసింది. ప్రస్తుత స్థాయిల వద్ద ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 2020 నుంచి బీఎస్‌6 ప్రమాణాల అమలు కంపెనీకి కలిసిరానుంది. అధిక టన్నేజ్‌ ట్రక్కులకు డిమాండ్‌ పెరగడం, కంపెనీకి డిఫెన్స్‌ రంగ

Most from this category