STOCKS

News


షార్ట్‌టెర్మ్‌లో 11,800-12,000 స్థాయి కష్టమే..

Friday 7th September 2018
Markets_main1536315640.png-20062

నిఫ్టీ సమీప కాలంలో 11,800-12,000 స్థాయిని చేరుకోలేకపోవచ్చని అజ్‌కాన్‌ గ్లోబల్‌ ఈక్విటీ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అకాశ్‌ జైన్‌ తెలిపారు. లార్జ్‌క్యాప్స్‌ వల్ల ఇండెక్స్‌లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. ఎల్‌టీసీజీ అమలు తర్వాత బాగా కరెక‌్షన్‌కు గురైన మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌ ఆమోదయోగ్యమైన వ్యాల్యుయేషన్స్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏఎస్‌ఎం అమలు, ఎఫ్‌పీఐలపై సెబీ సర్క్యులర్‌ వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. రూపాయి పతనం, ద్రవ్యలోటు పెరుగుదల వల్ల మార్కెట్లపై ఒత్తిడి పెరగొచ్చని అంచనా వేశారు. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. 
దేశీ ఇన్వెస్టర్ల డబ్బు మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా దేశీ మార్కెట్‌లోకి రావడం, విదేశీ ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్లు మార్కెట్ల పెరుగుదల దోహదపడ్డాయని అకాశ్‌ జైన్‌ తెలిపారు. సమీప కాలంలో కచ్చితంగా కరెక‌్షన్‌ ఉంటుందని పేర్కొన్నారు. జీడీపీ వృద్ధి బాగునప్పటికీ అధిక క్రూడ్‌ ధరలు, రూపాయి పతనం వంటి అంశాలు ద్రవ్యలోటుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని, దీంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ తగ్గుతుందని వివరించారు. రుతుపవనాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, క్రూడ్‌ ధరల్లో అస్థిరత, వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్‌ సమావేశం వంటి అంశాలు మార్కెట్లో ఒడిదుడుకులకు కారణమౌతాయని పేర్కొన్నారు. అందువల్ల ఇన్వెస్టర్లు బాగున్న స్టాక్స్‌కే ప్రాధ్యామివ్వాలని సూచించారు. 
రూపాయి జీవిత కాల కనిష్ట స్థాయిల్లో ట్రేడవుతుండటం వల్ల ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్‌, స్పెషాలిటీ కెమికల్స్‌ స్టాక్స్‌ లబ్ది పొందుతాయని అకాశ్‌ జైన్‌ తెలిపారు. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా స్టాక్స్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు. ఈ కంపెనీలు క్రూడ్‌ను డాలర్‌ ప్రాతిపదికన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు విక్రయిస్తాయని తెలిపారు. దిగుమతి ఆధారిత కంపెనీలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. మెటల్స్‌, పవర్‌, సిమెంట్‌ స్టాక్స్‌పై నెగటివ్‌ ప్రభావం ఉంటుందని తెలిపారు. విదేశీ రుణాలు అధికంగా ఉన్న కంపెనీలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. ఇక క్యూ1లో జీడీపీ వృద్ధి 8.2 శాతంగా నమోదవ్వడం ఆశ్చర్యం కలిగించలేదని తెలిపారు. సవరించిన బేస్‌ ఇయర్‌ ఆధారంగా ఈ వృద్ధి సాధ్యమైందన్నారు. రూపాయి సమీప కాలంలో 73 దిగువకు వెళ్లే అవకాశం లేదన్నారు. 
జీడీపీ వృద్ధి వల్ల రుణ చెల్లింపులు పెరిగి పీఎస్‌యూ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు తగ్గొచ్చని ఆకాశ్‌ జైన్‌ తెలిపారు. అలాగే బ్యాంక్‌ మేనేజ్‌మెంట్లు కూడా రికవరీపై దృష్టి కేంద్రీకరించాయని పేర్కొన్నారు. రిక్యాపిటలైజేషన్‌, రికవరీ వల్ల బ్యాంకులు వృద్ధి బాటలో పయనిస్తాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యాల్యుయేషన్స్‌ తగ్గాయని, దీర్ఘకాల లక్ష్యంతో రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడే ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సూచించారు. ఐటీ, ఫార్మా స్టాక్స్‌ను ప్రస్తుతం కొనుగోలు చేయవచ్చన్నారు. ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో అధిక వ్యాల్యుయేషన్స్‌ ఉన్నాయని తెలిపారు. ఇందులో కొంత కరెక‌్షన్‌ ఉండొచ్చని అంచనా వేశారు. ఫార్మా విభాగంలో సన్‌ ఫార్మాపై, ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌పై, ఇన్సూరెన్స్‌ విభాగంలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌పై బుల్లిష్‌గా ఉన్నామని తెలిపారు.  



You may be interested

రూపాయి రికవరీతో రెండోరోజూ లాభాలే..!

Friday 7th September 2018

11550 పైన నిఫ్టీ రాణించిన అటో, మెటల్‌ ఫార్మా షేర్లు మార్కెట్‌  వారంతపు రోజైన శుక్రవారం లాభంతో ముగిసింది. రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల దిగిరావడంతో సూచీలు రెండోరోజూ లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 147 పాయింట్ల లాభంతో 38390 వద్ద ముగిసింది. మరో ప్రధాన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ ఇంట్రాడేలో 11603 వరకు ర్యాలీ చేసింది. చివరికి 52 పాయింట్ల లాభంతో 11550 పాయింట్లపైన 11589 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఒక్క ప్రభుత్వ

తగ్గినప్పుడల్లా కొనండి..

Friday 7th September 2018

వినియోగ రంగ స్టాక్స్‌ను పడిపోయినప్పుడల్లా కొనొచ్చంటున్నారు ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయురేష్‌ జోషి. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.  ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ ఒక సమయంలో కన్సాలిడేట్‌ అవుతాయని తెలిపారు. విక్రయాల వృద్ధి గతేడాది తక్కువ స్థాయిలో నమోదయ్యిందే విషయాన్ని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కంపెనీల మేనేజ్‌మెంట్లు భవిష్యత్‌లో బలమైన విక్రయాల వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాయని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర, కొత్త

Most from this category