STOCKS

News


15% కరెక‌్షన్‌.. అయినా కొనొద్దు..

Tuesday 25th September 2018
Markets_main1537863701.png-20557

ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌ 10-15 శాతం కరెక‌్షన్‌ అయ్యాయని కొనడానికి వెంపర్లాడవద్దని సూచించారు ఐథాట్‌ ఫౌండర్‌ శ్యామ్‌ శేఖర్‌. ఎన్‌బీఎఫ్‌సీ ర్యాలీ ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని, స్టాక్‌ ధరల కదలికల ఆధారంగా గుడ్డిగా ఏ నిర్ణయం తీసుకోకూడదని హెచ్చరించారు. రేట్లు ఎలా మారుతున్నాయి.. వ్యవస్థలో లిక్విడిటీ ఎలా పనిచేస్తోంది.. అనే అంశాలను గమనించాలని తెలిపారు. మైక్రోక్యాప్‌ షేర్లు పాజిటివ్‌ రిటర్న్స్‌ అందిస్తాయని అనుకోవడం అవివేకమని పేర్కొన్నారు. ఇవి వచ్చే రెండేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబర్చలేవని తెలిపారు. యస్‌ బ్యాంక్‌ షేరుపై నమ్మకంగా లేనని, అందువల్ల ఈ స్టాక్‌కు దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
ఆకర్షణీయమైన రేట్లలో లిక్విడిటీ అందుబాటులో ఉన్నప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలు మంచి పనితీరు కనబర్చాయని శ్యామ్‌ శేఖర్‌ తెలిపారు. అయితే పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. అలాగే ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల్లో అధిక వ్యాల్యుయేషన్స్‌ ఉన్నాయనే అంశాన్ని గమనించాలని తెలిపారు. వీటిల్లో 10-15 శాతం కరెక‌్షన్‌ జరిగిందని, అయినంత మాత్రాన వీటి కొనుగోలుకు సిద్ధపడకూడదని పేర్కొన్నారు. 
క్రూడ్‌ ధరల పెరుగుదల ప్రభావం ఇంకా ద్రవ్యోల్బణ గణాంకాల్లో ప్రతిఫలించలేదని శ్యామ్‌ శేఖర్‌ తెలిపారు. అతిత్వరలో ఇది జరుగుతుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముందని, దీన్ని ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుందో చూడాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరల పెరుగుదల వల్ల ఆయిల్‌ ఆధారిత కంపెనీలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ప్రస్తుత క్వార్టర్‌ పనితీరు సూచిస్తుందని తెలిపారు. 
యస్‌ బ్యాంక్‌పై ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధంగా లేనని శ్యామ్‌ శేఖర్‌ పేర్కొన్నారు. ఆ సంస్థ గవర్నెర్స్‌పై నమ్మకం లేదని తెలిపారు. అందువల్ల ఈ స్టాక్‌కు దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. కొత్త మేనేజ్‌మెంట్‌ వచ్చిన తర్వాత అభిప్రాయం మారొచ్చని తెలిపారు. ఇక మైక్రోక్యాప్స్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. ఇండెక్స్‌లలో ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు వెయిటేజీ ఎక్కువగా ఉందన్నారు. ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కేటాయింపులు కూడా అధిక మొత్తంలోనే ఉన్నాయని తెలిపారు. వ్యవస్థాగతంగానే ఇక్కడ రిస్క్‌ ఉందని పేర్కొన్నారు. రిస్క్‌ పెరిగే కొద్ది మనీ ఇతర విభాల్లోకి వెళ్లిపోయి ఇండెక్స్‌లను నిలకడగా ఉంచుతాయని తెలిపారు. రూపాయి క్షీణిస్తున్నప్పుడు ఐటీ, ఫార్మా స్టాక్స్‌ మంచి హెడ్జ్‌ సాధనాలుగా పనిచేస్తాయని పేర్కొన్నారు.  You may be interested

ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ ఐపీఓకు అప్లయ్‌ చేస్తున్నారా?

Tuesday 25th September 2018

ముంబై: రిటైల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ మంగళవారం(25న) ప్రారంభమైంది. గురువారం (27న) ముగిసే ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1734 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఈ ఐపీఓకు ధరల శ్రేణి రూ. 818-821ల మధ్య నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ మొత్తం రూ. 400 కోట్ల విలువైన 16.21 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది. ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సిటీగ్రూప్‌

ఎం&ఎం ఫైనాన్స్‌ 7శాతం అప్‌..!

Tuesday 25th September 2018

ముంబై:- లిక్విడిటీ కొరత కారణంగా కొన్ని హౌసింగ్స్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎం&ఎం)ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ షేరు మాత్రం లాభాల బాట పట్టింది. నేడు బీఎస్‌ఈలో ఎం&ఎం ఫైనాన్స్‌ షేరు రూ.391.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రేటింగ్‌ సంస్థలు ఎం&ఎం ఫైనాన్స్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో షేరుకు కొనుగోళ్ల మద్దతు పెరిగింది. ఫలితంగా ఇంట్రాడేలో షేరు 7.50శాతం ర్యాలీ చేసి రూ.420.20 గరిష్టానికి

Most from this category