STOCKS

News


స్మాల్‌క్యాప్‌లో ఒక వంతు కంటే ఎక్కువొద్దు!

Saturday 23rd February 2019
Markets_main1550861901.png-24284

స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో ఒక వంతు కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం సూచనీయం కాదని హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఐవో ప్రశాంత్‌జైన్‌ తెలిపారు. ముంబైలో  జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాధారణ ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై సూచనలు చేశారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో పావు శాతం లేదా ఒక వంతు (33 శాతం) వరకు స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో పెట్టబడులు పెట్టుకోవచ్చన్నారు. ప్రతీ రంగంలో పెద్ద కంపెనీలు (లార్జ్‌క్యాప్‌) స్మాల్‌ క్యాప్‌ కంపెనీల కంటే ఎక్కువ వేగంగా వృద్ధి చెందగలవని జైన్‌ చెప్పారు. లార్జ్‌క్యాప్‌ల కంటే స్మాల్‌క్యాప్‌లు తప్పనిసరిగా వేగంగా వృద్ధి  చెందుతాయని లేదన్నారు. స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఎక్కువ రిస్క్‌ ఉంటుందని తెలిసిన విషయమే.

 

‘‘చారిత్రకంగా చూస్తే స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ లార్జ్‌క్యాప్‌ కంపెనీల కంటే చెప్పుకోతగ్గ స్థాయిలో తక్కువగానే ట్రేడ్‌ అయ్యాయి. కానీ, 2014 తర్వాత పరిస్థితి మారింది. స్మాల్‌క్యాప్స్‌ లార్జ్‌క్యాప్‌ను మించి పనితీరును చూపించాయి’’ అని ప్రశాంత్‌జైన్‌ తెలిపారు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు గతేడాది కాలంలో 30 శాతానికి పైగా నష్టపోతే, ఇదే కాలంలో నిఫ్టీ-50 సూచీ 3.53 శాతం పెరిగింది. ఇండస్ట్రియల్స్‌ పట్ల జైన్‌ బుల్లిష్‌గా ఉన్నారు. కంపెనీల మూలధన నిధుల వ్యయాలు పునరుద్ధరణ అయినట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే, విచక్షణా రహితంగా వినియోగంపై ఆధారపడిన (కన్జ్యూమర్‌) రంగం పట్ల తాను సానుకూలంగా లేనట్టు తెలిపారు. ఈ కంపెనీల షేర్లు చాలా ఖరీదుగా మారాయని, రానున్న కాలంలో తగ్గుముఖం పట్టొచ్చన్నారు. ఈక్విటీ మార్కెట్లపై ఎన్నికల ఫలితాల ప్రభావం పట్ల తాను ఆందోళన చెందడం లేదన్నారు. ‘‘1979 నుంచి ఉన్న గణాంకాలను పరిశీలిస్తే... ఎన్నికలు జరిగిన ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ మార్కెట్లు సానుకూల రాబడులనే ఇచ్చాయి’’ అని జైన్‌ తెలిపారు. జీడీపీలో మార్కెట్‌క్యాప్‌ రేషియో పరంగా చూస్తే భారత మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత ధరల్లో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ సహేతుకం నుంచి మోస్తరుగా ఉన్నట్టు పేర్కొన్నారు.



You may be interested

ప్రమోటర్ల తాకట్టు వ్యాపారం!

Saturday 23rd February 2019

డిసెంబర్‌ త్రైమాసికంలో పలు కంపెనీల ప్రమోటర్లు తమ వాటాల తనఖాను పెంచితే, కొన్ని కంపెనీల ప్రమోటర్లు తనఖా మొత్తాన్ని తగ్గించుకున్నారు. బీఎస్‌ఈ-500లోని స్టాక్స్‌ గణాంకాల ఆధారంగా కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఓ నివేదికను రూపొందించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోలిస్తే ‍ప్రమోటర్ల తాకట్టు వాటాల పరిమాణం డిసెంబర్‌ క్వార్టర్లో స్థిరంగా ఉంది. ప్రమోటర్ల తాకట్టు వాటాలు 6.7 శాతంగా ఉన్నాయి. తాకట్టు వాటాల విలువ రూ.1.96 లక్షల కోట్లు. 116 కంపెనీల

అక్కడక్కడే ముగిసిన మార్కెట్‌

Friday 22nd February 2019

దేశీయ మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితులు సూచీల ర్యాలీని రెండురోజులకే పరిమితం చేశాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు అక్కడిక్కడే ముగిశాయి. సెన్సెక్స్‌ 27 పాయింట్ల నష్టంతో 35,871 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 10,792 వద్ద స్థిరపడ్డాయి. అమెరికాలో ఆర్థిక గణాంకాలు బలహీన నమోదు కావడంతో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ ప్రతికూల ప్రభావం ప్రపంచమార్కెట్లను వెంటాడింది.

Most from this category