STOCKS

News


కొనుగోళ్లకు ఇది కాలం కాదు!

Thursday 25th October 2018
personal-finance_main1540464679.png-21485

ఇన్వెస్టర్లకు వివేక్‌ మవానీ సూచన
నిఫ్టీలో వంద, నూటయాభై పాయింట్ల ఊగిసలాటి ఇవాళరేపు కామనయిపోయిందంటున్నాడు ప్రముఖ ఇన్వెస్టర్‌ వివేక్‌ మవానీ. సూచీలు ఎంత ప్రయత్నించినా బౌన్స్‌బ్యాక్‌ నిలవడంలేదన్నారు. యూఎస్‌ మార్కెట్లు పడకముందే మన మార్కెట్లలో కరెక‌్షన్‌ ఆరంభమైందని, ఇప్పుడు అమెరికా మార్కెట్లు కూడా ఢమాల్‌మనడం ఆరంభించినందున మన సూచీల్లో మరింత పతనం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందువల్ల బాటమ్‌అవుట్‌ అయ్యాయని భావించి హడావుడిగా కొనుగోళ్లు చేయవద్దని ఇన్వెస్టర్లకు ఆయన సూచించారు. కేవలం సెల్‌ ఆన్‌ ర్యాలీ సూత్రమే ప్రస్తుతానికి వర్తిస్తుందని, బై ఆన్‌ డిప్స్‌ ఇంకా వర్తించదని చెప్పారు. అటు సూచీలైనా, ఇటు స్టాకులైనా ఇంకా కొనుగోళ్లకు అనుకూలంగా మారలేదన్నారు. కొన్ని వారాలుగా రంగాలకు రంగాలు నెగిటివ్‌గా మారిపోతున్నాయన్నారు. అలాంటి రంగాల్లో ఎంత నాణ్యమైన కంపెనీ షేరైనా మరింత పతనం అయ్యేందుకే ఎక్కువ ఛాన్సులుంటాయన్నారు. ఉదాహరణకు బజాజ్‌ ఫైనాన్స్‌పై ప్రతిఒక్కరూ పాజిటివ్‌గా ఉంటారని, అలాగని ఈ షేరు సమీప భవిష్యత్‌లో మరింత పతనం కాదని భరోసా లేదని తెలిపారు. 
ఈ మూడూ పరిశీలించవచ్చు..
మార్కెట్లు కొంచెం నిలదొక్కుకున్న తర్వాత సీఈఎస్‌సీ, స్పెన్సర్‌ రిటైల్‌, సీఈఎస్‌సీ వెంచర్స్‌ షేర్లను కొనొచ్చని వివేక్‌ సిఫార్సు చేశారు. ఈ మూడు కంపెనీల పునాదులు, బాలెన్స్‌ షీట్లు, వ్యాపారాలు బాగున్నాయన్నారు. అదేవిధంగా బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో వృద్ది సంబంధిత ఆటంకాలు, బాలెన్స్‌ షీట్‌ సంబంధిత బాధలు లేని కంపెనీలను ఎంచుకోవచ్చన్నారు. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌కు ఈ సమస్యలున్నాయని, అదే కోటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లకు ఈ సమస్యలు లేవని చెప్పారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో సైతం మంచి పనితీరు కనబరిచే సంస్థలే సంక్షోభానంతరం భారీ పరుగులు తీస్తాయని వివరించారు. You may be interested

10,050 స్థాయికి నిఫ్టీ గ్యాప్‌డౌన్‌

Friday 26th October 2018

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో శుక్రవారం మార్కెట్‌ మళ్లీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్‌ గత ముగింపు 33,690 పోలిస్తే 87 పాయింట్లు నష్టంతో 33,777 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన గత ముగిపంపు 10,123 పాయింట్లతో  పోలిస్తే 1 పాయింట్‌ లాభంతో  10,122 ప్రారంభమైంది. ఉదయం గం.9:30ని.లకు నిప్టీ సూచీ 107 పాయింట్లు నష్టపోయి 10,017ల వద్ద, సెన్సెక్స్‌ సూచీ 300 పాయింట్ల నష్టపోయి 33,389 వద్ద

ప్రపంచ మార్కెట్ల కల్లోలం...సెన్సెక్స్‌ 344 పాయింట్లు డౌన్‌

Thursday 25th October 2018

10150 దిగువకు నిఫ్టీ ముంబై:- ప్రపంచ మార్కెట్లు తీవ్ర పతనం చవిచూసిన నేపథ్యంలో భారత్‌ సూచీలు గురువారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. గత రాత్రి అమెరికా సూచీలు 2-3 శాతం, నేడు ఆసియాలో ప్రధాన సూచీలు 1-4 శాతం మధ్య పతనమైన నేపథ్యంలో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన భారత్‌ సూచీలు...ప్రతీ చిన్న పెరుగుదలలోనూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నేడు అక్టోబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ గడువు నేపథ్యంలో ట్రేడర్లు...వారి పొజిషన్ల స్క్వేర్‌ఆఫ్‌ కార్యకలాపాల్లో నిమగ్నంకావడంతో దిగువస్థాయిలోనే

Most from this category