STOCKS

News


10,750 దాటేవరకు భారీ లాభాలు ఉండకపోవచ్చు..!

Saturday 10th November 2018
Markets_main1541835688.png-21866

ముంబై: శుక్రవారం సెన్సెక్స్‌ 79 పాయింట్లు నష్టంతో 35,158 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,585 వద్ద ముగిసింది. ఉదయం 10,614 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. అంతక్రితం ముగింపుతో పోల్చితే 17 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ఇంట్రాడేలో 10,619 పాయింట్ల వద్ద గరిష్టస్థాయిని, 10,545 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. అంతకుముందు వారంతో పోల్చితే గడిచిన వారంలో నిఫ్టీ 32 పాయింట్లు లాభంతో ముగిసింది. మొత్తం మీద గడిచిన వారంలో 10,600-10,750 శ్రేణిలో ఉన్నటువంటి కీలక నిరోధస్థాయికి చేరుకోలేకపోయింది. దీపావళి రోజున జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌ ముగింపులో కూడా ఈ స్థాయికి చేరువై నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తరువాత ‍నిఫ్టీ ప్రయాణం ఏ విధంగా ఉంటుందనే అంశంపై స్పందించిన టెక్నికల్‌ అనలిస్టులు.. వచ్చే వారంలో భారీ లాభాలకు అవకాశం ఉండకపోవచ్చని అంచనావేస్తున్నారు. వారాంతం ముగింపు నుంచి ఉన్నటువంటి 150 పాయింట్ల కీలక నిరోధస్థాయి వద్ద బహుళ నిరోధకాలు కనిపిస్తున్నట్లు వెల్లడించారు. డైలీ చార్ట్‌లోని ఫాలింగ్‌ ట్రేడ్‌ లైన్‌, 10,712 పాయింట్ల వద్ద 50-రోజుల సగటు కదలికలు, 10,762 వద్ద ఉన్న 200-రోజుల సగటు కదలికలు ఈ 150 పాయింట్ల శ్రేణిలోనే ఉన్నట్లు తెలిపారు. నిఫ్టీకి తక్షణ కీలక మద్దతుస్థాయి 10,510 పాయింట్ల వద్ద, ఆ తరువాత 10,415 పాయింట్ల వద్ద ఉన్నట్లు వెల్లడించారు. వీక్లీ ఆర్‌ఎస్‌ఐ 45.8021 వద్ద న్యూట్రల్‌గా ఉండగా.. వీక్లీ ఎంఏసీడీ మాత్రం బేరిష్‌గానే ఉంది. భారీ పతనం తరువాత ట్రిపుల్‌ బోటమ్‌ అయిన 10,000-10,070 రేంజ్‌లో మద్దతు తీసుకున్న నిఫ్టీ.. ఆ తరువాత పుల్‌బ్యాక్‌ అయినప్పటికీ 10,600-10,650 స్థాయికి చేరువలో నిలిచిపోయింది. ప్రస్తుత స్థాయిల వద్ద కన్సాలిడేట్‌ అవుతున్న నిఫ్టీ 10,750 స్థాయిని దాటేవరకు మేజర్‌ ర్యాలీలు ఉంటాయని భావించలేమని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ ఉన్నటువంటి పరిస్థితుల్లో షార్ట్స్‌కు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. 

ఇవి కేవలం పలువురు టెక్నికల్‌ అనలిస్టుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.



You may be interested

2 కొనొచ్చు.. 1 హోల్డ్‌ చేయొచ్చు..

Saturday 10th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం..  ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఇండోస్టాక్‌ క్యాపిటల్‌పై సెంట్రమ్‌ బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. బై రేటింగ్‌ ఇచ్చింది. స్టాక్‌కు టార్గెట్‌ ప్రైస్‌ను రూ.450గా (ప్రస్తుత ధర రూ.327) నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2 ఎర్నింగ్స్‌ అంచనాలు మించాయని పేర్కొంది. మార్జిన్లు మెరుగుపడ్డాయని తెలిపింది. రుణ నాణ్యత ఆరోగ్యకరంగా ఉందని పేర్కొంది. క్యాపిటల్‌

డీఎల్‌ఎఫ్‌ టార్గెట్‌ @ 253

Saturday 10th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా రియల్టీ సంస్థ డీఎల్‌ఎఫ్‌ షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌: డీఎల్‌ఎఫ్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.174 టార్గెట్‌ ప్రైస్‌: రూ.253 హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తాజాగా డీఎల్‌ఎఫ్‌పై బుల్లిష్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.253గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించిందని

Most from this category