STOCKS

News


ఎన్నికలయ్యేంత వరకు ఆగండి!

Wednesday 8th August 2018
Markets_main1533722178.png-19054

ఆ తర్వాతే పెట్టుబడులు బెటర్‌
ప్రిన్సిపాల్‌ పీఎన్‌బీ ఏఎంసీ సీఐఓ రజత్‌ జైన్‌
ఈ ఏడాది ఆరంభంలో కరెక‌్షన్‌ అనంతరం నిఫ్టీ పుంజుకొని కొత్త గరిష్ఠాలను తాకింది. అయితే ఈ ఊపు మొత్తం స్టాకులన్నింటిలో కనిపించలేదు. కేవలం కొన్ని లార్జ్‌ క్యాప్స్‌ మాత్రమే నిఫ్టీని పైకి లేపాయని రజత్‌ చెప్పారు. ఇక మీదట ఇలాంటి మూవ్‌కు ఆస్కారం ఉండకపోవచ్చన్నారు. ఇప్పటినుంచి లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అన్నీ ఒకేలా ప్రవర్తించే ఛాన్సులున్నాయని అంచనా వేశారు. వచ్చే 12 నెలల కాలానికి లేదా కనీసం ఎన్నికలయ్యేవరకు మార్కెట్లు ఆటుపోట్లకు గురైతూ అక్కడక్కడే కదలాడవచ్చన్నారు. వచ్చే ఏడాది వరకు సూచీలు మరింత పెరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. అందువల్ల దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు తొందరపడి పెట్టుబడులు పెట్టే కన్నా, ఎన్నికలు పూర్తయ్యేవరకు వేచిచూడడం మంచిదని సూచించారు. 2004, 2009 ఎన్నికల సమయాల్లో ఏమి జరిగిందో గుర్తుంచుకోవాలన్నారు. 2004లో సూచీలు 20 శాతం వరకు పతనం కాగా, 2009లో ఒక్కసారిగా దూసుకుపోయాయి. ఎన్నికల వేళ ఇలాంటి పెద్ద పెద్ద ఆటుపోట్లు సహజంగా వస్తుంటాయి. అందుకని ఈ హడావుడి సద్దు మణిగేవరకు ఆగడం మంచిదని రజత్‌ సూచన. 
లార్జ్‌క్యాప్స్‌? మిడ్‌క్యాప్స్‌?
రెండుమూడేళ్ల కాలపరిమితి కోసం కొనుగోళ్లు చేసేవారు లార్జ్‌క్యాప్స్‌ను ఎంచుకోవచ్చని రజత్‌ సూచించారు. కొన్ని మిడ్‌క్యాప్స్‌ సైతం ఈ స్థాయిల వద్ద ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. లార్జ్‌క్యాప్స్‌ అయినా, మిడ్‌క్యాప్స్‌ అయినా వచ్చే ఎన్నికల వేడిలో ఒడిదుడుకులు ఎదుర్కోకతప్పవని అభిప్రాయపడ్డారు. అందుకని చాలా సెలెక్టివ్‌గా వ్యవహరించాలన్నారు. ఫలానా స్టాక్స్‌ అని ఎంచుకునే బదులు థీమ్స్‌ ఆధారిత ఎంపిక చేసుకోవడం మంచిదన్నారు. ఎర్నింగ్స్‌ అంచనాలతో ప్రస్తుతానికి అన్ని థీమ్స్‌ ఉత్తమ ప్రదర్శన చూపాయన్నారు. అందువల్ల చాలా జాగ్రత్తతో కూడిన ఎంపిక అవసరమని చెప్పారు. మార్కెట్లను ఆశ్చర్యపరిచే సత్తా ఉన్న స్టాకులు, థీమ్స్‌పై కన్నేయాలని సూచించారు. తన వరకు తాను హోటల్స్‌, బీమా థీమ్స్‌పై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. 
అంతర్జాతీయం ఆందోళనకరం
ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని రజత్‌ అన్నారు. ప్రపంచీకరణ కొత్తలో అంతర్జాతీయ వాణిజ్యం క్రమంగా పెరిగే ఒక అంశమని అంతా భావించేవాళ్లు. 2008 మందగమనం అనంతరం అంతర్జాతీయ వాణిజ్యం బాగా మందగించింది. ఇటీవలే గ్లోబల్‌ ట్రేడ్‌ ఊపందుకుంది. అయితే అంతే వేగంగా అంతర్జాతీయ వాణిజ్యం కుంగిపోయే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. గ్లోబలైజేషన్‌ తీసుకువచ్చిన దేశాలే అందుకు భిన్నంగా మాట్లాడుతున్నాయి. భారతీయ కంపెనీలకు ట్రేడ్‌ వార్‌తో నేరుగా భయం లేదు కానీ, క్యాపిటల్‌ ప్రవాహంపై నెగిటివ్‌ ప్రభావం ఉండవచ్చని రజత్‌ చెప్పారు. ప్రస్తుతం ఒక్క ట్వీట్‌తో మార్కెట్లు మారిపోతున్నాయని, క్రూడాయిల్‌ ధర తలకిందులవుతోందని చెప్పారు. అందువల్ల ప్రపంచ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలని సూచించారు. 


 You may be interested

ఎంఅండ్‌ఎంపై బుల్లిష్‌

Wednesday 8th August 2018

ఆటోమొబైల్‌ రంగానికి చెందిన మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎంఅండ్‌ఎం స్టాక్‌పై బ్రోకరేజ్‌ సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. బ్రోకరేజ్‌: మెక్వైరీ రేటింగ్‌: ఔట్‌పర్ఫార్మ్‌ టార్గెట్‌: రూ.1,050 ఈ గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ ఎంఅండ్‌ఎం టార్గెట్‌ ధరను రూ.940 నుంచి రూ.1,050కి పెంచింది. కొత్త మోడళ్ల వల్ల 2018-19 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో యుటిలిటీ వాహన విక్రయాలు పెరగొచ్చని

సిప్‌ నిధుల ప్రవాహం లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకే...

Wednesday 8th August 2018

గతేడాది వరకు స్మాల్‌క్యాప్‌ ఫం‍డ్స్‌లోకి సిప్‌ పెట్టుబడులు ఎక్కువగా వచ్చేవని రిలయన్స్‌ నిప్సాన్‌ లైఫ్‌ ఏఎం ఈడీ, సీఈవో సుదీప్‌ సిక్కా తెలిపారు. అయితే ఏడాది నుంచి మరీముఖ్యంగా 3-4 నెలల కాలంలో లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి సిప్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. గత నెలలో మార్కెట్లు పడ్డప్పుడు గమనిస్తే ట్రెండ్‌ మారిందని తెలిపారు. గత 4-5 నెలలుగా

Most from this category